OTT: నెట్ ఫ్లిక్స్ తో ఇండియాస్ బిగ్ స్టార్ .. గట్స్ ఉన్న కంటెంట్, కొడుకుతో పెద్ద ప్లానే
ప్రెజెంట్ ఇండియన్ సినిమా దగ్గర మన తెలుగు సినిమాలు, టాలీవుడ్ స్టార్స్ ఏ ఇతర హీరో కూడా చూడని క్రేజ్ అండ్ మార్కెట్ ని చూస్తున్న సంగతి. అయితే ఇది ఇప్పటి మాట కానీ ఒకప్పుడు అంటే ఇండియన్ సినిమా అంటే ఒక్క హిందీ సినిమా మాత్రమే అని వినిపించేది. మన తెలుగు సినిమాలో ఉన్నట్టు హిందీ సినిమాలో కూడా చాలా మంది బిగ్ స్టార్స్ ఉన్నారు. ఎన్నో ఏళ్ళు నుంచి హిందీ సినిమాని రూల్ చేస్తున్న ఆ బిగ్ స్టార్స్ లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా ఒకరు.
మరి షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన సినిమాలు ఆ మధ్య సరిగా రాణించలేదు కానీ గత మూడు సినిమాలుతో మాత్రం షారుఖ్ ఖాన్ కొట్టిన హిట్స్ చూసి బాలీవుడ్ సహా ఇండియాస్ టాప్ దర్శకుడు రాజమౌళి కూడా షాకయ్యారు. వరుసగా రెండు రూ.1000 కోట్ల సినిమాలు అందించి బాలీవుడ్ కి ఊపిరి పోసిన షారుఖ్ ఖాన్ మళ్లీ తనకి తిరుగులేదు అని చూపించారు.

అయితే ఇపుడు మరిన్ని సినిమాలతో తను బిజీగా ఉండగా రీసెంట్ గా ఓ బిగ్ అనౌన్స్మెంట్ అయితే ఎస్ఆర్‌కే అందించాడు. వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి మోస్ట్ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ తో ఇపుడు చేతులు కలిపినట్టుగా షారుఖ్ ఖాన్ బిగ్ అనౌన్స్మెంట్ చేశాడు. కాగా షారుఖ్ ఖాన్‌కు సెపరేట్ గా నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ సంస్థతో చేసిన సినిమానే "జవాన్" ఇది హిందీలో నయా రికార్డులు సెట్ చేసి భారీ లాభాలు అందించింది.
కాగా తన భార్య గౌరీ ఖాన్ ఈ నిర్మాణ సంస్థ భాద్యతలు చూసుకుంటే ఇపుడు వీరు నెట్ ఫ్లిక్స్ తో కలిపి ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ తో రాబోతున్నట్టు కన్ఫర్మ్ చేసారు. షారుఖ్ ఖాన్ కి తన వారసుడు ఆర్యన్ ఖాన్ ఉన్నాడు. మరి తన తోనే ఈ బిగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం విశేషం. అయితే ఇంట్రెస్టింగ్ గా షారుఖ్ ఖాన్ తన వారసుడుని హీరోగా కాకుండా దర్శకుడుగా పరిచయం చేస్తున్నాడు.
2025లో మొదలయ్యే ఈ భారీ వెబ్ సిరీస్ కి కథ రాసుకున్నది దర్శకత్వం వహించేది ఆర్యన్ ఖానే అంటూ షారుక్ సగర్వంగా అనౌన్స్ చేసాడు. అంతేకాకుండా ఇది ఒక గట్స్ ఉన్న కంటెంట్ అని, అలాగే మంచి ఎమోషన్స్ ఫన్ ని కూడా తన కొడుకు జోడించాడు అని తెలిపాడు. మరి నెట్ ఫ్లిక్స్ తో సిరీస్ అంటే మినిమం గ్యారెంటీ కంటెంట్ అని చెప్పొచ్చు. మరి ఈ బిగ్గెస్ట్ కలయికలో రానున్న వెబ్ సిరీస్ ఎలాంటి ట్రీట్ ఇస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











