Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ తరువాత.. సౌత్‌పై ఫోకస్ పెట్టిన మరో బాలీవుడ్ హీరో.. పాన్ ఇండియా మూవీ
రానున్న రోజుల్లో దేశమంత ఇండియన్ సినిమా అనేది మాత్రమే ఉండాలి. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా ఉండకూడదు.. అని దర్శకుడు రాజమౌళి గతంలో ఒక కామెంట్ చేశాడు. భాషతో అనువాదం అయినా కూడా అందరూ ఆస్వాధించేలా ఇండియన్ సినిమాలు ఉండాలని చాలా మంది అనుకుంటున్నారు. పాన్ ఇండియా సినిమాలు ఆ తరహాలోనే ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయని చెప్పవచ్చు.
మార్గాన్ని పెద్దదిగా మారుస్తున్న తెలుగోళ్ళు
భవిష్యత్తులో ఇది నిజమయ్యేలా ఉంది. బహుబలి, KGF వంటి సినిమాలు ఆ విషయంలో ఇప్పటికే ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేశాయనే చెప్పాలి. కేవలం కలెక్షన్స్ తోనే కాకుండా ఇండియా సినిమా స్థాయిని పెంచాయి. అసలైతే పాన్ ఇండియా అనే పదానికి మొదట బాలీవుడ్ హీరోలు న్యాయం చేస్తారని అనుకున్నారు. కానీ మన సౌత్ హోరోలే ఆ మార్గాన్ని మరింత పెద్దదిగా మారుస్తున్నారు.
100కోట్ల బిజినెస్..
గతంలో సౌత్ సినిమాలంటే బాలీవుడ్ వారికి కాస్త చిన్న చూపే. అయితే అలాంటి వారి చూపులను మాయం చేసేశారు మన వాళ్ళు. ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల్లో 100కోట్ల బిజినెస్ ఉందని ఋజువయ్యింది. అయితే త్వరలో బాలీవుడ్ నుంచి మరో హీరో కూడా పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అమీర్ ఖాన్, సల్మాన్.. ప్లాన్ ప్లాప్
ఒకసారి అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ సౌత్ లో హిట్ అందుకోవాలని బాగానే కష్టపడ్డారు గాని పెద్దగా వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా అమీర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమాను తెలుగు తమిళ్ లలో భారీగా రిలీజ్ చేసి ప్రయత్నాలు చేశాడు గాని ఎక్కడ అది వర్కౌట్ కాలేదు. ఇక సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమాతో కమర్షియల్ గా సౌత్ మార్కెట్ పై పట్టు సాధించాలని చూశాడు. అది కూడా ప్లాప్ అయ్యింది.
షారుక్ కూడా ఫిక్స్ అయ్యాడు
ఇక ఇప్పుడు షారుక్ ఖాన్ సౌత్ లో పట్టు సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అట్లీ దర్శకత్వంలో ఫ్యూచర్ లో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నా షారుక్ ఆ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించాలని అనుకుంటున్నట్లు సమాచారం. నటీనటులను కూడా సౌత్ నుంచే సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారట. మరి షారుక్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.