KKR చెత్త ఆటతో అప్సెట్ అయిన షారుఖ్ ఖాన్.. క్షమాపణలు చెబుతూ..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ మొత్తానికి కూల్ గా మొదలైంది. ప్రతిసారి ఆట పాటలతో అంగరంగ వైభవంగా మొదలయ్యే ఈ ఇండియన్ లీగ్ ఈ సారి కరోనా కారణంగా హడావుడి లేకుండా స్టార్ట్ అయ్యింది. ఇక 5వ మ్యాచ్ తోనే ట్విస్టులు మొదలయ్యాయి. దాదాపు గెలిచేసింది అని అనుకున్న KKR జట్టు చివరికి చేతులు ఎత్తేయడంతో ఆ జట్టు ఓనర్ షారుక్ ఖాన్ ఊహించని విధంగా ట్వీట్ చేశాడు.

100వ విజయం

100వ విజయం

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఈ సారి విజయంతోనే లీగ్ ను స్టార్ట్ చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తో మొదటి మ్యాచ్ ఆడిన నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ ప్రదర్శనతో మ్యాచ్ ను తనవైపుకు తిప్పేసుకుంది. ఆ విజయంతో 100 మ్యాచ్ లు గెలిచిన జట్టుగా ఐపీఎల్ రికార్డులో స్థానం సంపాదించుకుంది.

 కింగ్ ఖాన్ ప్రశంసల వర్షం

కింగ్ ఖాన్ ప్రశంసల వర్షం


100వ విజయం దక్కడంతో KKR యజమాని షారుక్ ఖాన్ ఎంతగానో సంతోషించాడు. సోషల్ మీడియా ద్వారా స్పంధించిన కింగ్ ఖాన్ ప్లేయర్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు. బాగా ఆడారు శభాష్ అంటూ మెరుగైన ప్రదర్శనను కనబరిచిన ఆటగాళ్లపై కూడా కామెంట్ చేశారు. ప్రత్యర్థి జట్టు కూడా బాగా పోరాడినట్లు ట్వీట్ చేశారు.

 షాక్ ఇచ్చిన KKR

షాక్ ఇచ్చిన KKR

అయితే రెండవ మ్యాచ్ కు వచ్చేసరికి నైట్ రైడర్స్ వారి యజమానికి షాక్ ఇచ్చింది. దాదాపు గెలిచేసే మ్యాచ్ ను ముంబై చేతుల్లో పెట్టేసింది. బాల్ కు ఒక పరుగు తీసుకున్నా కూడా విజయం దక్కేది. కానీ ముంబై కాన్ఫిడెన్స్ ముందు KKR తలొగ్గడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఊహించని విదంగా ట్రోల్ చేస్తున్నారు.

క్షమాపణ చెప్పక తప్పలేదు

క్షమాపణ చెప్పక తప్పలేదు


అయితే విషయం మరింత ముదరకముందే షారుక్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు క్షమాపణ చెప్పక తప్పలేదు. నిరుత్సాహపరిచే పెర్ఫామెన్స్.. ఇది చాలా తక్కువ స్థాయి ఆట అంటూ అభిమానులకు క్షమాపణ చెప్పారు. ఇక ఆ ట్వీట్ నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. ఇక షారుక్ అభిమానులు ఎప్పటిలానే ఓడినా గెలిచినా తమ ఫేవరేట్ టీమ్ KKR అని సపోర్ట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X