twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శృంగార తార బయోపిక్‌లో బాలీవుడ్ బ్యూటీ.. ట్రెడిషనల్ లుక్ అదుర్స్!

    |

    Recommended Video

    శృంగార తార బయోపిక్‌లో బాలీవుడ్ బ్యూటీ

    శృంగార తార షకీలా అడల్ట్ చిత్రాలలో ఓ సంచలనం. సౌత్ లో అన్ని భాషల్లో ఆమె నటించారు. షకీలా జీవితం అనేక ఒడిదుడుకతో కూడుకున్నది. షకీలా జీవిత గాధ నేపథ్యంలో ఆమె బయోపిక్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షకీలా పాత్రలో నటించడం కోసం చాలామంది హీరోయిన్లని అనుకున్నారు. కానీ చివరకు రిచా చద్దా ఎంపికైంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    ట్రెడిషనల్ లుక్

    ట్రెడిషనల్ లుక్

    ఈ చిత్ర ఫస్ట్ లుక్ తాజగా బయటకు వచ్చింది. కేరళ యువతిగా షకీల పాత్రలో రిచా చద్దా అదరగొట్టేసింది. చీరకట్టులో షకీలని గుర్తుకు తెచ్చేలా రిచా చద్దా ఉంది. ఫస్ట్ లుక్ స్టిల్స్ సోషల్ మీయదలో వైరల్ గా మారాయి.

    కొన్ని రోజుల క్రితమే

    కొన్ని రోజుల క్రితమే

    ఇటీవలే రిచా చద్దా షకీలాని కలిసింది. బయోపిక్ చిత్రం చేస్తున్న నేపథ్యంలో తన గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు రిచా చద్దా షకీలని కలిసింది. ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

     ఛాలెంజింగ్

    ఛాలెంజింగ్

    షకీలా పాత్రలో నటించడం ఛాలెంజింగ్ అని రిచా చద్దా తెలిపింది. షకీలా యంగ్ ఏజ్ నుంచి ఆమె అడల్ట్ చిత్రాల్లో పాపులర్ అయ్యే వరకు ఆమె జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. షకీలా బాడీ లాంగ్వేజ్ లో నటించడం తనకు పెద్ద సవాల్ అని తెలిపింది.

    శృంగార తారగా

    శృంగార తారగా

    శృంగార తారగా షకీలా చాలా కాలం వెండి తెరపై వెలుగు వెలిగింది. రిచా చద్దా కూడా బోల్డ్ రోల్స్ ఏమాత్రం వెనకాడకుండా నటిస్తుంది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా వచ్చిన డర్టీ పిక్చర్ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

    English summary
    Shakeela biopic first look. Richa Chadha remind you of Shakeela
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X