బచ్చా గాడివా? సిగ్గుండాలి... నువ్వూ కామాత్ముడివే, నీ బాగోతం అందరికీ తెలుసు!

Recommended Video

Shakti Kapoor Responds On Tanushree Dutta issue

2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' అనే సినిమా షూటింగులో తనతో నానా పాటేకర్ మిస్ బిహేవ్ చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని హీరోయిన్ తనుశ్రీ దత్తా ఆరోపణలు చేయడం బాలీవుడ్లో సంచలనం అయింది. పదేళ్ల తర్వాత ఈ విషయాన్ని మాజీ మిస్ ఇండియా మళ్లీ తెరపైకి తెచ్చిన నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు ఆమెకు మద్దతుగా మాట్లాడుతున్నారు. అయితే కొందరు స్టార్స్ మాత్రం ఈ విషయమై స్పందించడానికి ఇష్టపడటం లేదు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ శక్తి కపూర్‌ను ఇటీవల మీడియా ప్రతినిధులు తనుశ్రీ-నానా పాటేకర్ ఇష్యూపై స్పందించాలని కోరగా వెటకారం ప్రదర్శించారు.

 అపుడు నేను బచ్చాగాన్ని, నాకేం తెలియదు

అపుడు నేను బచ్చాగాన్ని, నాకేం తెలియదు

‘పదేళ్ల క్రితం ఈ సంఘటన జరిగిందా? సార్... నాకేం తెలియదు. ఎందుకంటే అపుడు నేను బచ్చాగాన్ని'... అంటూ శక్తి కపూర్ ఈ సీరియస్ ఇష్యూపై కామెడీ చేసే ప్రయత్నం చేశారు. శక్తి కపూర్ స్పందించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి.

 అపుడు శక్తి కపూర్ వయసు ఎంతంటే?

అపుడు శక్తి కపూర్ వయసు ఎంతంటే?

2008లో తనుశ్రీ దత్తా-నానా పాటేకర్ సంఘటన జరిగినపుడు శక్తి కపూర్ వయసు 56 సంవత్సరాలు. ‘దస్ సాల్ పహెలె తో మై చోటా సా బచ్చా థా' అంటూ శక్తి కపూర్ స్పందించిన తీరును అంతా తప్పుబడుతున్నారు. అలా అనడానికి నీకు సిగ్గు లేదా? అంటూ కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

నువ్వూ కామాత్ముడివేగా...

శక్తి కపూర్ ఇలా స్పందించడంపై కొందరు అతడిపై ట్రోల్స్ ప్రారంభించారు. 2005లో ఓ నటిని సెక్సువల్ ఫేవర్ అడుగుతూ స్టింగ్ ఆపరేషన్లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన వైనాన్ని గుర్తు చేస్తూ సెటైర్లు వేయడం ప్రారంభించారు.

నీ కూతురు కూడా నటిగా ఇండస్ట్రీలో ఉందిగా? ఇలాగేనా స్పందించేది

నీ కూతురు(శ్రద్ధా కపూర్) కూడా నటిగా ఇండస్ట్రీలో ఉంది. తనుశ్రీ దత్తాను నానా పాటేకర్ వేధించినట్లు నీ కూతురును ఎవరైనా వేధిస్తే ఇలాగే స్పందిస్తావా? కనీసం ఒక కూతురికి తండ్రిగా ఆలోచించు అంటూ శక్తి కపూర్ మీద నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

నీ మీద వచ్చిన టేప్స్ మరిచిపోయావా?

శక్తి కపూర్ మీద 2005లో విడుదలైన స్టింగ్ ఆపరేషన్ వీడియోలను పలువురు గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో ఓ నటికి తన సినిమాలో అవకాశం ఇవ్వడానికి అతడు సెక్సువల్ ఫేవర్ కోరినట్లు వెల్లడైన ఆ స్టింగ్ ఆపరేషన్ టేపులు అప్పట్లో సంచలనమైన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X