ప్రభాస్ హీరోయిన్ పెళ్లి వార్త: బుల్‌షిట్, ఐదేళ్ల వరకు పెళ్లి చేసుకోదు.. భగ్గుమన్న తండ్రి
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దాకపూర్ పెళ్లి వార్తలు కొద్దిరోజులుగా మీడియాలో స్వైర విహారం చేస్తున్నాయి. తన బాల్య మిత్రుడు, ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ రోషన్ శ్రేష్టను 2020లో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందుకోసమే సైనా నేహ్వాల్ బయోపిక్ నుంచి తప్పుకొన్నట్టు వార్తా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ వార్తలపై శ్రద్ధాకపూర్ తండ్రి, ప్రముఖ బాలీవుడ్ విలన్ శక్తికపూర్ భగ్గుమన్నారు. ఆయన ఏమన్నారంటే...

తన కూతురు పెళ్లి వార్త గురించి
రోహన్ శ్రేష్టను తన కూతురు శ్రద్ధాకపూర్ పెళ్లి చేసుకోబోతున్నారంటే వచ్చిన వార్తల్లో నిజం లేదు. అవన్నీ బుల్‌షిట్. మరో 5 ఏళ్ల వరకు శ్రద్ధాకు పెళ్లి చేసుకొనే ఆలోచన లేదు. ప్రస్తుతం తన దృష్టి అంతా కెరీర్ మీదే ఉంది అని శక్తి కపూర్ అన్నారు.

రెండేళ్ల వరకు బిజీగా
వచ్చే రెండేళ్ల వరకు శ్రద్ధాకపూర్ కాల్షిట్స్, కెరీర్ బిజీగా ఉంది. వరుసగా సినిమాల్లో నటిస్తున్నది. తన కూతురు కెరీర్‌ను నాశనం చేసేందుకే రూమర్లు క్రియేట్ చేస్తున్నారు. శ్రద్ధాకపూర్ వివాహ వార్తల్లో వాస్తవం లేదు. కొందరు చేస్తున్న కుట్ర అనే అనుమానాన్ని శక్తి కపూర్ వ్యక్తం చేశారు.

లింక్ పెడితే పెళ్లి జరుగుతుందా?
గతంలో ఎంతో మంది హీరోలతో శ్రద్దాకపూర్‌కు అఫైర్లు ఉన్నాయని రూమర్లు వచ్చాయి. సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లకు లింక్ పెట్టడం వల్ల పెళ్లి జరిగిపోదు. రోషన్ తండ్రి రాకేష్ (బాలీవుడ్ ఫోటోగ్రాఫర్) నాకు మంచి స్నేహితుడు. మేమంత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని శక్తి కపూర్ తెలిపారు.

శ్రద్దాకపూర్ పెళ్లి చేసుకోదని
తన జీవితంలో జరిగే ప్రతీ విషయాన్ని నా కూతురు నాతో పంచుకొంటుంది. తన తల్లిదండ్రుల అనుమతి లేకుండా శ్రద్ధాకపూర్ పెళ్లి చేసుకోదు. ఏదైనా అలాంటి విషయం ఉంటే మా దృష్టికి తీసుకొస్తుంది. వాస్తవాలు లేకుండా అర్ధంపర్థం లేని వార్తలు రాయకండి అని శక్తి కపూర్ ఫైర్ అయ్యారు.

ప్రభాస్‌తో శ్రద్దా బిజీగా
శ్రద్ధాకపూర్ ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి సాహో చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అలాగే వరుణ్ ధావన్‌తో కలిసి స్ట్రీట్ డ్యాన్సర్ చిత్రంలో నటిస్తున్నది. అయితే ఆమె సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటించాల్సి ఉంది. కొన్ని కారణాల తప్పుకోవడంతో రోషన్‌తో పెళ్లి కారణంగా శ్రద్దా ఆ నిర్ణయం తీసుకొన్నదనే వార్త వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











