రియా చక్రవర్తి లాంటి ఆడవాళ్లు చాలా మందే ఉంటారు.. అలియాపై నవాజుద్దీన్ సిద్దిఖీ సోదరుడి సెటైర్!

బాలీవుడ్‌లో ప్రస్తుతం ఎన్నో వ్యవహారాలు చర్చల్లోకి వస్తున్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా సుశాంత్ సింగ్ మరణం, అతని ఫ్యామిలీ సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిపై ఫిర్యాదు చేయడంతో అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే ఈ వ్యవహారంపై నవాజుద్దీన్ సిద్దిఖీ సోదరుడు షమాస్ నవాబ్ సిద్దిఖీ సెటైరికల్ కామెంట్స్ చేశాడు. వారి సొంతింటి వ్యవహారం, సోదరుడు భార్య అలియాపై కామెంట్స్ చేశాడు. అవేంటో ఓ సారి చూద్దాం.

విడాకుల వ్యవహారం వైరల్..

విడాకుల వ్యవహారం వైరల్..

ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి, అలియా విడాకుల వ్యవహారం బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. తనను పట్టించుకోడని, ఇన్నేళ్లు భరించానని, ఇకపై ఓపిక లేదంటూ భర్తకు విడాకుల నోటీస్ ఇచ్చానని అలియా బహిరంగంగా ప్రకటించింది.

అందుకే ఎంట్రీ..

అందుకే ఎంట్రీ..

తాను విడాకులు కోరినా నవాజుద్దీన్ స్పందించడం లేదని, తనను అగౌరవ పర్చాలని, లేనిపోని సంబంధాలను అంటగడుతున్నారని అలియా వాపోయింది. నిజానిజాలు బయట పెట్టేందుకే తాను సోషల్ మీడియాలో ప్రవేశించానని తెలిపింది. తనకు భరణం చెల్లించామని, పిల్లల చదువులకు సంబంధించిన బాధ్యతలు కూడా తీసుకున్నామని, ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నవాజుద్దీన్ లాయర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా సోదరుడి సెటైర్..

తాజాగా సోదరుడి సెటైర్..

ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం రియా చక్రవర్తి పేరు మార్మోగిపోతోంది. సుశాంత్ ఫ్యామిలీ రియాపై కేసు నమోదు చేయడంతో నవాజుద్దీన్ సోదరుడు ఎంటర్ అయ్యాడు. తాను ముందు నుంచి అదే చెబుతున్నానని, అలాంటి మా ఫ్యామిలీకి కూడా జరిగాయని చెప్పుకొచ్చాడు. అదే క్రమంలో మరో ట్వీట్ చేస్తూ అలియా సిద్దిఖీపై సెటైర్ వేశాడు.

Recommended Video

Arjun Suravaram Movie Review | Samantha In Family Man Season 2
 రియా లాంటి వారుంటారు..

రియా లాంటి వారుంటారు..

‘రియా చక్రవర్తి లాంటి వారు చాలా మందే ఇక్కడ ఉంటారు.. అలా బ్లాక్ మెయిల్ చేస్తూ.. ఎదుటివారి ప్రేమను, పరువుతో ఆడుకుంటారు.. డబ్బులు కాజేయాలని చూస్తుంటారు.. వ్యక్తిగతంగానైనా, మీడియా ద్వారానో, ట్విట్టర్ ద్వారానో ఇలా ఏదో రకంగా బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉంటార' షమాస్ నవాబ్ అలియాపై పరోక్షంగా కామెంట్స్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X