Shamita Shetty: యాక్సిడెంట్ లో లవర్ మృతి.. నీడలా వెంటాడుతూ.. ఓపెన్ అయిపోయిన షమిత!

బిగ్ బాస్ 15 OTTలో గాయని నేహా భాసిన్‌కు శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి మంచి స్నేహితురాలిగా మారింది. తాజా నేహా భాసిన్‌తో తన వ్యక్తిగత జీవితం గురించి షమితా శెట్టి అనేక విషయాలను పంచుకున్నారు. తన మొదటి ప్రియుడు కారు ప్రమాదంలో మరణించిన విషయం కూడా షమితా శెట్టి చెప్పి చాలా ఎమోషనల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే

 ఎప్పుడూ ఓపెన్ కాకుండా

ఎప్పుడూ ఓపెన్ కాకుండా

షమితా శెట్టి తన వ్యక్తిగత జీవితం గురించి చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అయితే, ఆమె తన గతాన్ని నేహా భాసిన్‌తో పంచుకున్నారు. తన బాయ్‌ఫ్రెండ్ మరణం తర్వాత తాను చాలా సెన్సిటివ్ గా మారానని షమిత చెప్పింది. చాలా కాలంగా, నేను ఎవరినీ నా జీవితంలోకి రానివ్వలేదు, నాకు మళ్ళీ మామూలు మనిషిని అవ్వడానికి మళ్ళీ నాతో నేను కనెక్ట్ అవ్వడానికి నాకు చాలా సమయం పట్టిందని వెల్లడించింది.

ఎవరి గేమ్ వాళ్ళదే

ఎవరి గేమ్ వాళ్ళదే

బిగ్ బాస్ OTT గత ఎపిసోడ్‌లోనే ఈ అతిపెద్ద ట్విస్ట్‌ వెలుగు చూసింది. బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవాలని తేల్చి చెప్పారు. అదే సమయంలో, కొద్ది రోజుల నుంచి మంచి సంబంధంతో ఉన్న షమితా శెట్టి మరియు రాకేష్ మధ్య చిన్న పాటి గొడవలు ప్రతి రోజూ కనిపించేవి. అయితే ఇటీవల షమిత తన మొదటి బాయ్‌ఫ్రెండ్‌ను గుర్తు చేసుకుంటూ షోలో కనిపించింది. షమిత తన బాయ్‌ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ కెమెరా ముందు ఏడ్చింది.

నేహా భాసిన్‌తో

నేహా భాసిన్‌తో

బిగ్ బాస్ OTT లైవ్ ఫీడ్‌లో, షమిత తన ప్రత్యేక స్నేహితురాలు నేహా భాసిన్‌తో తన గత సంబంధాల గురించి బహిరంగంగా మాట్లాడింది. 'చాలా కాలంగా నేను నా జీవితంలో ఎవరినీ రానివ్వలేదు, నన్ను నేను నిలదోక్కుకుని బయట పడడానికి చాలా సమయం పట్టింది'. అబూ ఆమె పేర్కొంది. తన ప్రియుడిని కోల్పోయిన తర్వాత నేను బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానని పేర్కొన్న ఆమె అతను తనను బాగా చూసుకునేవాడని వెల్లడించారు.

అన్నీ ఓపెన్ అయి

అన్నీ ఓపెన్ అయి

రాకేష్ బాపత్‌, షమిత ఇద్దరి మధ్య మంచి బంధం కనిపించింది. ఇంట్లో చాలా మంది సభ్యులు ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ప్రేమ అని కూడా అనుకుంటునారు. ఇక అదే సమయంలో, షమిత తనకు రాకేష్ అంటే ఇష్టమని నేహా ముందు కూడా ఒప్పుకుంది. అయితే ముందు నుంచి చాలా చిన్న విషయాల కోసం ఇద్దరి మధ్య భీకర తగాదాలు జరిగాయి. ఇక షమితా రాకేష్‌ బాపత్‌తో మాట్లాడుతూ.. ఒంటరిగా ఉన్నా ఎంతో స్ట్రాంగ్‌గా ఉండేదానని పేర్కొన్న ఆమె కోవిడ్‌ వల్ల విధించిన లాక్‌డౌన్‌ సమయంలో మాత్రం ఒంటరితనంగా ఫీల్‌ అయినట్లు' వెల్లడించింది. తన తండ్రి మరణానంతరం తన భుజాలపై పడిన బాధ్యతల గురించి కూడా ఆమె ఓపెన్ అయింది.

Recommended Video

Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu
ఆమె నాకు నీడలా

ఆమె నాకు నీడలా

అంతే కాక 'నేను ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్ల పైనే గడిచినా ఇప్పటికీ అందరూ నన్ను శిల్పాశెట్టి సోదరిగానే గుర్తిస్తున్నారు, ఆమె ఇప్పటికీ నాకు నీడలా ఉందని, ఒకరకంగా అది సంతోషంగానే ఉన్నా నా గురించి జనానికు నిజం తెలీదు' అని పేర్కొంది. ఇక ఆమె నీడ నుంచి బయటపడి తను కోసం ప్రత్యేక గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X