సంజయ్ లీలా భన్సాలీతో అలాంటి రిలేషన్.. గర్వంగా ఉంది.. షర్మీన్ సెహగల్

బాలీవుడ్‌లోని ప్రముఖ దర్శక, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ తన మేన కోడలు షర్మీన్ సెహగల్, ప్రముఖ నటుడు జావేద్ జాఫ్రీ కుమారుడు మీజాన్‌ను పరిచయం చేస్తూ మలాల్ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం జూలై 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో షర్మీన్ మీడియాతో మాట్లాడుతూ.. భన్సాలీ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని పంచుకొన్నారు.

మలాల్ సినిమా కంటే ముందుగా బాజీరావు మస్తానీ సినిమా షూటింగ్ సమయంలో మూవీ మేకింగ్‌ను నేర్చుకొన్నాను. ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. నాలుగేళ్ల వయసులో నేను సంజయ్ లీలా భన్సాలీ సెట్స్‌కు వెళ్లాను. అప్పుడు ఐశ్వర్య ఒడిలో కూర్చోవాలని చెబితే అందరూ నవ్వారు అని షర్మీన్ సెహగల్ చెప్పారు.

Sharmin Segal: I have the pressure as Sanjay Leela Bhansalis niece

బాజీరావు మస్తానీ సినిమా షూటింగ్ సమయంలో భన్సాలీ ఎంత గొప్పవాడో తెలుసుకొన్నాను. ఆయన హిందీ సినిమాకు చేస్తున్న సేవను గ్రహించాను. టీమ్ వర్క్‌కు ఆయన ఎంత విలువ ఇస్తాడో నాకు తెలుసు అని షర్మీన్ తెలిపారు. నాకు కుటుంబ పరమైన సంబంధం ఉన్నప్పటికీ.. ఆయనను నేను సర్ అని సంభోదిస్తాను. అది ఆయనకు నేను వ్యక్తిగతం ఇచ్చే గౌరవం అని అన్నారు.

మలాల్ సినిమా ద్వారా హీరోయిన్‌గా మారడం, అది కాకుండా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. భన్సాలీ కోడలు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అయితే నాకు నేను ప్రూవ్ చేసుకోవడమనేది నా ముందు ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ అని షర్మీన్ చెప్పారు.

దక్షిణాదిలో ఘన విజయం సాధించిన 7జీ బృందావన్ కాలనీ సినిమా ఆధారంగా మలాల్ రూపొందింది. సంజయ్ లీలా భన్సాలీ, భూషణ్ కుమార్, మహావీర్ జైన్, కిషన్ కుమార్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X