#మీటూ: ప్రముఖ నటుడి సంచలనం నిర్ణయం, కామాంధులతో పని చేస్తా!
దేశ వ్యాప్తంగా #మీటూ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. పలువురు నటీమణులు తమకుఎదురైన లైంగిక వేధింపుల సంఘటనల గురించి ధైర్యంగా ముందుకొచ్చి చెబుతున్నారు. సుభాష్ ఘాయ్, సాజిద్ ఖాన్, సుభాస్ కపూర్ లాంటి టాప్ డైరెక్టర్స్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి పని చేయకూడదని అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి పెద్ద పెద్ద స్టార్స్ నిర్ణయం తీసుకోవడంతో మీటూ ఉద్యమం మరింత బలపడింది. మరో వైపు రాజకీయ రంగంలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి ఎంజె అక్బర్ పదవి నుంచి తప్పుకున్నారు.

మీటూ ఉద్యమంపై శతృఘ్న సిన్హా సంచలన వ్యాఖ్యలు
అయితే మీటూ ఉద్యమంపై ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు శతృఘ్న సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మీటూ' పేరుతో ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. ఇది సరైంది కాదు. మీకు అన్యాయం జరిగితే పోలీస్ కంప్లయింట్ ఇవ్వండి, కోర్టును ఆశ్రయించండి.... ఇలా ఎవరు పడితే వారిపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

నా 40 ఏళ్ల కెరీర్లో తప్పు చేయలేదు
నా 40 ఏళ్ల కెరీర్‌లో ఏనాడూ ఏ మహిళతోనూ అసభ్యకరంగా ప్రవర్తించలేదు. ప్రతి మహిళ పట్ల ఎంతో మర్యాదగా ప్రవర్తించాను అని ఈ సందర్భంగా శతృఘ్నసిన్హా తెలిపారు.

మీటూ పేరుతో ఆరోపణలు చేయొద్దు
మీటూ పేరుతో ఎవరు పడితే వారిపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయవద్దు. మీకు ఎవరి వల్ల అయినా అన్యాయం జరిగితే, ఎవరి వల్ల అయినా ఇబ్బంది ఏర్పడి ఉంటే వారిపై పోలీస్ కేసు పెట్టండి, కోర్టును ఆశ్రయించండి అని శతృఘ్న సిన్హా తెలిపారు.

కామాంధులైనా వారితో పని చేస్తాను
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నవారితో కలిసి పని చేయవద్దని కొందరు అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. నా ఫ్రెండ్ సుభాష్ ఘాయ్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అతడు తప్పు చేయక పోయినా, తప్పు చేసినట్లు రుజువైనా ఆయనతో కలిసి పని చేస్తాను. సంజయ్ దత్ కూడా జైలుకెళ్లి వచ్చినవాడే. అతడి బయోపిక్ కూడా ఆదరించారు అని శతృఘ్న సిన్హా తెలిపారు.


Click it and Unblock the Notifications











