క్యాన్సర్ చికిత్స: సోనాలి బింద్రే పరిస్థితి ఎలా ఉందంటే...

By Bojja Kumar

Recommended Video

Producer Shrishti Arya Talks About Sonali Bendre's Health

హీరోయిన్ సోనాలి బింద్రే క్యాన్సర్ భారిన పడి ప్రస్తుతం న్యూయార్కులో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆమెకు సోకిన ఈ వ్యాధి ప్రమాదకరంగా 4వ దశలో ఉండటంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతూనే ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సోనాలి తన ఫ్యాన్స్ అధైర్య పడకుండా ఎప్పటికప్పుడు తన చికిత్సకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు.

తాజాగా సోనాలి బింద్రే సిస్టర్-ఇన్-లా, బాలీవుడ్ నిర్మాత శ్రిష్టి ఆర్య స్పాట్‌బాయ్ వెబ్ సైట్‌తో మాట్లాడుతూ... 'సోనాలి స్ట్రాంగ్‌గా ఉందని, ఎంతో మనోధైర్యం, ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది' అని వెల్లడించారు. అభిమానులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, సోనాలి వీలైనంత త్వరగా కోలుకుంటుందని వెల్లడించారు.

సోనాలి బింద్రే

సోనాలి బింద్రే

కొన్ని రోజుల క్రితం తన జుట్టు కత్తిరించుకున్న సోనాలి బింద్రే తన 12 ఏళ్ల కుమారుడు రణవీర్‌తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టు ద్వారా తనకు సోకిన వ్యాధి గురించి తన కుమారుడికి చెప్పే ప్రయత్నం చేయడంతో పాటు అతడి రియాక్షన్‌ను అభిమానులతో పంచుకుంది.

మనో ధైర్యంతో...

మనో ధైర్యంతో...

తాను చెప్పిన విషయాన్ని తన కుమారుడు అర్థం చేసుకున్నాడని, వాడిలో అంత మెచ్యూరిటీ వచ్చినందుకు ఆనందంగా ఉందని, అది తనలో మరింత దైర్యాన్ని నింపిందని సోనాలి బింద్రే చెప్పే ప్రయత్నం చేశారు.

అభిమానులకు ధైర్యం...

అభిమానులకు ధైర్యం...

సోనాలి కుమారుడు రణవీర్ ప్రస్తుతం తల్లితో పాటు న్యూయార్క్‌లోనే ఉన్నాడు. అక్కడి సెంట్రల్ పార్కులో ఆడుకుంటున్న ఫోటోలను సోనాలి తన అభిమానులతో పంచుకున్నారు. తాను చికిత్స తీసుకుంటూ దైర్యంగా ఉన్నానని, అభిమానులూ తనలాగే ధైర్యంగా ఉండాలని సోనాలి తెలిపారు.

అంతా షాక్

అంతా షాక్

కొన్ని రోజుల క్రితం సోనాలి తనకు క్యాన్సర్ సోకిన విషయం బయటకు చెప్పగానే ఆమె అభిమానులతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు షాకయ్యారు. హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో నటించిన సోనాలి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తమ అభిమాన నటికి క్యాన్సర్ సోకిందనే వార్త చాలా మందికి మింగుడు పడలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X