twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ తండ్రి ఇంకా అదే షాక్‌లో ఉన్నారు.. ఒక్క మాట కూడ మాట్లాడలేదన్న నటుడు

    |

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణ వార్తను ఇంకా కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. జూన్ 14న తన నివాసంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు సుశాంత్. అయితే డిప్రెషన్ కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడనే వాదన వినిపిస్తున్నా.. అది కచ్చితంగా హత్యేనని అభిమానులు, నెటిజన్స్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సుశాంత్ మరణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. అందులో సుశాంత్ స్నేహితుడు, నటుడు శేఖర్ సుమన్ కూడా ఒకడు. తాజాగా ఆయన సుశాంత్‌కు నివాళి అర్పించేందుకు పాట్నాకు చేరుకున్నాడు. ఆ సంగతి గురించి వివరిస్తూ సుశాంత్ తండ్రి గురించి చెప్పుకొచ్చాడు.

    సుశాంత్ జ్ఞాపకార్థం..

    సుశాంత్ జ్ఞాపకార్థం..

    సుశాంత్ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు చివరగా వీడ్కోలు చెప్పారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన చేశారు. సుశాంత్ జ్ఞాపకార్థం అతను నివసించిన ఇంటిని మెమోరియల్‌గా మార్చుతామని, పుస్తకాలు, వస్తువులు అన్నింటిని అతని అభిమానుల కోసం భద్రపరుస్తామని వెల్లడించారు. క్రీడలు, సినిమా, సైన్స్ విభాగంలో యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

     ఫ్యామిలీకి పరామర్శ..

    ఫ్యామిలీకి పరామర్శ..

    సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయనకు నివాళి అర్పించేందుకు సోమవారం కుటుంబ సభ్యులంతా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సుశాంత్‌ ఫ్యామిలీని పరామర్శించేందుకు ఆయన స్నేహితుడు, నటుడు శేఖర్ సుమన్ పాట్నాకు వెళ్లాడు. ఈ మేరకు అక్కడ జరిగిన సంగతిని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.

    ఇంకా అదే షాక్‌లో..

    ఇంకా అదే షాక్‌లో..


    ‘సుశాంత్ తండ్రిని కలిశాను.. అతని శోకాన్ని చూశాను.. ఏం మాట్లాడకుండా మేము కొన్ని నిమిషాలు అలాగే నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నాం. ఆయన ఇంకా అదే షాక్‌లో ఉన్నారు.. మా మౌనమే గొప్ప నివాళి అనుకుని అలాగే ఉండిపోయామ'ని శేఖర్ ట్వీట్ చేశాడు.

    Recommended Video

    Sushant Singh Rajput: Paani సహా 7 Movies నుంచి ప్లాన్ ప్రకారం Sushant ని తొలగించారు
    వదిలే ప్రసక్తే లేదు

    వదిలే ప్రసక్తే లేదు


    అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత్ మరణంపై వెనకడుగు వేసేది లేదని చెప్పుకొచ్చాడు. దీనిపై పోరాటం చేస్తానన్నాడు. ఏది ఏమైనా వదిలే ప్రసక్త లేదని తెలిపాడు. జస్టిస్ట్ ఫర్ సుశాంత్ ఫోరమ్ అనే సంస్థను కూడా స్థాపించాడు. సుశాంత్ మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాడు.

    English summary
    Shekhar Suman About Sushant Singh Father. Met Sushant's father..shared his grief.we sat together for a few minutes without exchanging a word..He is still in a state of deep shock..I feel the best way to express grief is thru silence.#justiceforSushantforum #CBIEnquiryForSushant
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X