దొరికింది చిన్న చేప.. బాలీవుడ్‌లో తిమింగళాలను పట్టాలి.. దిశ కేసును కూడా
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదురొంటున్న రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి అరెస్ట్‌తో డ్రగ్ మాఫియాతో బాలీవుడ్ సంబంధాలు మరోసారి బయటపడ్డాయి. ఇప్పుడు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు పలువురు బాలీవుడ్ హీరోల పార్టీలపై దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో షోవిక్ అరెస్ట్ తర్వాత పలువురు బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు.

షోవిక్ చక్రవర్తి అరెస్ట్‌తో బండారం బయటకు
డ్రగ్స్ కేసులో షోవిక్ చక్రవర్తి అరెస్ట్ తర్వాత టెలివిజన్ నటుడు శేఖర్ సుమన్ స్పందిస్తూ.. ఈ వ్యవహారంలో చిన్న చేప దొరికింది. అసలు తిమింగాలాలను పట్టాల్సిన కార్యక్రమం ముందు ఉంది. డ్రగ్ మాఫియా బండారం బయటపడింది. బాలీవుడ్‌ను ప్రక్షాళన చేయాల్సిన సమయం ఇదే అంటూ శేఖర్ సుమన్ అన్నారు.

బాలీవుడ్‌లో పెద్ద తలలకు కూడా
డ్రగ్స్ మాఫియా లింకుల విషయానికి వస్తే.. రియా చక్రవర్తి వెనుకు పెద్ద తలలు ఉన్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనుక ఏవో బలమైన అనుమానాలు నన్ను మొదటి నుంచి వెంటాడుతున్నాయి. త్వరలోనే బాలీవుడ్‌లో సూత్రదారులు అరెస్ట్ కావడం తథ్యం అనే భావన కలుగుతున్నది అని శేఖర్ సుమన్ తెలిపారు.

ఇది తొలి విజయం అంటూ
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో వాస్తవాలు బయటకు రావడానికి షోవిక్ అరెస్ట్ తొలి అడుగు. డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపే ప్రయత్నంలో ఇది తొలి విజయం. ఈ కేసు నిజాయితీగా సాగితే మరికొంత మంది పెద్ద మనుషులు పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉంది అని శేఖర్ సుమన్ పేర్కొన్నారు.
Recommended Video

దిశ సలియాన్ కేసును మళ్లీ విచారించాలి
డ్రగ్స్ మాఫియా లింకులతో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరు సుశాంత్ కేసు దర్యాప్తు గురించి మాట్లాడుతూ వీడియోలను సెప్టెంబర్ 14న పోస్ట్ చేయండి. దిశ సలియాన్ కేసును కూడా తిరగదోడాలని డిమాండ్ చేయండి అంటూ శేఖర్ సుమన్ సూచించారు.


Click it and Unblock the Notifications











