సల్మాన్ ఖాన్ సిస్టర్‌ను వేధిస్తే.. బిగ్‌బాస్ షోలోకి తీసుకొంటారా? డైరెక్టర్ సాజిద్‌పై పోలీసులకు షెర్లీన్ ఫిర్య
మీటూ ఉద్యమంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సాజిద్ ఖాన్ మరోసారి ఇబ్బందుల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి. 2018లో తారలపై జరిగిన లైంగిక దాడుల గురించిన ఉద్యమం సినిమా పరిశ్రమలో ప్రకంపనలు రేపాయి. ప్రస్తుతం బిగ్‌బాస్ 16 సీజన్‌లో ఉన్న దర్శకుడు సాజిద్ ఖాన్‌పై శృంగార తార షెర్లీన్ చోప్రా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడం మరోసారి వివాదాస్పదంగా మారింది. ఈ వివాదాస్పద విషయంలోకి వెళ్లితే..

ఆడిషన్స్‌కు పిలిచి అలా వేధింపులు
2018లో మీటూ ఉద్యమం సందర్భంగా షెర్లీన్ చోప్రా మీడియా ముందుకు వచ్చి.. తనను సాజిద్ ఖాన్ లైంగిక దాడికి ప్రయత్నించారు. లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఆయన ఆడిషన్స్‌కు పిలిచి నా ముందు ఆయన పురుషాంగాన్ని తీసి చూపించాడు. నా పురుషాంగానికి ఎంత రేటింగ్ ఇస్తావు? నా అంగాన్ని టచ్ చేస్తావా? పట్టుకొని నీవు ఫీల్ అవుతావా? అని నన్ను వేధించాడు అని షెర్లీన్ చోప్రా సంచలన ఆరోపణలు చేశారు.

బాధితులకు భరోసా లభించడంతో
తనను వేధించినప్పటికి.. సాజిద్ ఖాన్‌కు ఇండస్ట్రీలో ఉన్న సంబంధాలకు భయపడి నేను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మీటూ ఉద్యమం వల్ల బాధితులకు భరోసా లభించడంతో ఒక్కొక్కరు బయటకు వచ్చి తాము పడిన వేధింపులను బయటకు చెప్పాలనే ధైర్యం వచ్చింది అని షెర్లీన్ చెప్పారు.

కేంద్ర సమాచార మంత్రికి ఫిర్యాదు
సాజిద్ ఖాన్ బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తర్వాత ముంబైలో మరోసారి షెర్లీన్ చోప్రా స్పందించింది. ఇలాంటి చరిత్ర ఉన్న సాజిద్‌ను ఎలా షోలోకి తీసుకొంటారు. నేర చరిత్ర ఉన్న సాజిద్‌ను బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు పంపాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే బిగ్‌బాస్ 16 షోను నిలిపివేయాలని కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు విన్నపం చేశానని షెర్లీన్ చోప్రా చెప్పారు.

బిగ్‌బాస్ నుంచి తొలగించాలి
బుధవారం అంటే ఏప్రిల్ 19వ తేదీన ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. సాజిద్ ఖాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాను. అతడిని బిగ్‌బాస్ షో నుంచి తొలగించాలని ఫిర్యాదు చేశాను. అతడికి నేర చరిత్ర ఉందనే కారణం వల్ల ఆయనను వెంటనే ఎలిమినేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను అని షెర్లీన్ చోప్రా తెలిపారు.

సల్మాన్ ఖాన్ చెల్లెలికి ఇలా జరిగితే..
బిగ్‌బాస్ నిర్వాహకులకు నా నుంచి ఒకటే ప్రశ్న.. సల్మాన్ ఖాన్ సోదరిపై లైంగిక వేధింపులకు పాల్పడితే సాజిద్ ఖాన్‌ను షోలోకి తీసుకుంటారా? సాజిద్ ఖాన్ వల్ల చాలా మంది అమ్మాయిలు పడిన బాధను ఎలా మరిచిపోతారు. సాజిద్‌కు భయపడి చాలా మంది బాధితులు వాస్తవాలు చెప్పలేకపోతున్నారు. వారందరి తరఫున నేను సాజిద్ నిర్వాకాలను బయటపెట్టాను అని షెర్లీన్ చోప్రా అన్నారు.


Click it and Unblock the Notifications











