మెరుపు తీగలా మారిన షెర్లిన్ చోప్రా.. లాక్‌డౌన్‌లో సిక్స్‌ప్యాక్ సాధించేంతగా

శృంగారతారగా విశేష అభిమానులను సొంత చేసుకొన్న షెర్లీన్ చోప్రా మరోసారి వార్తల్లో నిలిచారు. లాక్‌డౌన్ సమయంలో సిక్స్‌ప్యాక్ సాధించినంతగా తన బాడీని ఫిట్‌గా మలచుకొన్నారు. కొద్దిరోజులుగా ఇంటికే పరిమితమైన షెర్లీన్ చోప్రా వర్కవుట్లు, కసరత్తులతో మెరుపు తీగలా మారిపోయారు. షెర్లీన్ తన ట్రాన్స్‌ఫర్మేషన్‌ గురించి తన సౌందర్య రహస్యాలను వెల్లడిస్తూ..

గతేడాది నేను 59 కిలోల బరువు ఉండేదాన్ని. అప్పుడు నేను ముద్దుగా బొద్దుగా కనిపించేదానిని. మెరుపు తీగలా మారేందుకు లాక్‌డౌన్‌లో రెగ్యులర్‌గా వర్కవుట్లు చేశాను. నాకు దేహానికి సరిపడే కంటే ఎక్కువగా ఉన్న బరువును గణనీయంగా తగ్గించుకొని సన్నగా మారిపోయాను. నా ఆహారంలో కేవలం ప్రొటీన్ పదార్థాలను ఎక్కువగా తీసుకొని దేహంలోని కొవ్వును తగ్గించాను. నా ఫిట్‌నెస్ ట్రైనర్ యోగేష్ గైడెన్స్‌ ప్రకారం క్రమం తప్పకుండా వర్కవుట్లు చేశాను. యోగేష్ ప్రతీరోజు వీడియో కాల్ ద్వారా పనాకు సూచనలు ఇచ్చారు. అలాగే మానసిక ప్రశాంతత కోసం యోగా కూడా చేశాను అని షెర్లీన్ చోప్రా తెలిపారు.

 Sherlyn Chopras inspirational transformation story in lockdown

2017 నుంచి శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టిపెట్టాను. లాక్‌డౌన్‌లో ధూమ, మద్యపానానికి పూర్తిగా దూరమయ్యాను. శారీరానికి హాని కలిగించే ఆహార పదార్థాలు తీసుకోలేదు. నా మనసును ప్రశాంతంగా, స్వచ్ఛంగా పెట్టుకొన్నాను. క్రమశిక్షణతో కూడిన ఆహర నియమాలను పాటిస్తే 99 శాతం మానసిక ఆరోగ్యం సాధించవచ్చనే విషయాన్ని తెలుసుకొన్నాను.

షెర్లీన్ చోప్రా విషయానికి వస్తే.. తును తును అనే వీడియో ఆల్బమ్‌లో నటించారు టీ సిరీస్, షెర్లీన్ చోప్రా ప్రొడక్షన్ నిర్మించిన ఈ ఆల్బమ్కు వికీ, హర్దిక్ సంగీతం అందించగా, సుకృతి కక్కర్ ఆలపించారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లతోపాటు నిర్మాతగా, యాక్టర్‌గా, డైరెక్టర్‌గా, ర్యాపర్‌గా, సింగర్‌గా రాణించేందుకు సిద్దమవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X