బట్టలు మొత్తం విప్పు.. ప్రైవేట్ పార్ట్ సైజ్ చెప్పు: హైదరాబాద్ హీరోయిన్‌తో డైరెక్టర్ అసభ్య ప్రవర్తన
ఒకప్పుడు సినీ రంగానికి సంబంధించి ఏం జరిగినా పెద్దగా బయటకు వచ్చేవి కాదు. కానీ, ఇప్పుడు మాత్రం పలు రకాల సామాజిక మాధ్యమాలు రావడంతో ఎంతో మంది తెరపైకి వస్తున్నారు. అలా ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ గురించి పెదవి విప్పారు. ఈ క్రమంలోనే ఇప్పుడు హైదరాబాద్ హీరోయిన్ షెర్లిన్ చోప్రా కూడా మరోసారి తన గొంతును వినిపించింది. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా సదరు నటి తనకు జరిగిన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూడండి!
మిస్ ఆంధ్రా.. తెలుగు మూవీల్లో:షెర్లిన్ చోప్రా హైదరాబాద్‌లోనే జన్మించిన విషయం తెలిసిందే. ఆమె చదువుకుంటున్న సమయంలోనే ఆమె మిస్ ఆంధ్రా పోటీల్లో పాల్గొని గెలుపొందింది. ఆ తర్వాత 'వెండిమబ్బు' అనే సినిమాతో హీరోయిన్‌గా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందామె. ఆ తర్వాత ఈ భామ 'ఏ ఫిల్మ్ బై అరవింద్', 'సంథింగ్ స్పెషల్' సహా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.

బాలీవుడ్‌లో రెచ్చిపోయి మరీ:టాలీవుడ్‌లో చేసిన సినిమాలు షెర్లిన్‌కు అంతగా కలిసి రాలేదు. దీంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ భామ ముంబై వెళ్లింది. అక్కడ కొన్ని సినిమాల్లో నటించిన ఆమె.. 2012లో ప్లేబోయ్ మాస పత్రిక కవర్ పేజీపై నగ్నంగా కనిపించింది. ఆ తర్వాత సంచలన చిత్రం 'కామసూత్ర 3డీ'లోనూ పూర్తి నగ్నంగా నటించింది. ఇది అప్పట్లో సంచలనం అయిపోయింది.
ఎప్పుడు చూసినా అదే పనిలో:కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న షెర్లిన్ చోప్రా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయింది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అలాగే, తన కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఇలా చేసి ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. అలాగే, ఆమెకు ఓ యాప్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.

ఆ డైరెక్టర్‌పై ఆరోపణలు చేసి:సంచలన తార షెర్లిన్ చోప్రా తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి మరోసారి మాట్లాడింది. ముఖ్యంగా ఈ సందర్భంగా ఆమె 'నా తండ్రి చనిపోయిన తర్వాత అంటే 2005 ఏప్రిల్‌లో షాజీద్ నన్ను రూంకి పిలిచాడు. సినిమాకు సంబంధించిన డిస్కర్షన్ జరుగుతోన్నప్పుడు చెడుగా ప్రవర్తించాడు' అని తెలిపింది.
ప్రైవేట్ పార్ట్ చూపించాడని:షెర్లిన్ కొనసాగిస్తూ.. 'నాతో మాట్లాడుతూనే షాజీద్ ఎక్కడపడితే అక్కడ తాకాడు. ఆ తర్వాత తన ఫ్యాంట్ విప్పి మర్మాంగాన్ని చూపిస్తూ పట్టుకోమన్నాడు. అంతేకాదు, ఆ ఫీలింగ్ ఎలా ఉందో చెప్పమన్నాడు. సైజ్ కూడా కొలవమని అడిగాడు. దీంతో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ వెంటనే అక్కడి నుంచి వచ్చేశాను. ఇదంతా నాలో నేను దాచుకున్నా' అని చెప్పుకొచ్చింది.

అందుకే దాచిపెట్టానంటూ:షెర్లిన్ చోప్రా చాలా కాలం పాటు ఈ విషయాన్ని దాయడంపై స్పందిస్తూ.. 'ఇది జరిగి చాలా ఏళ్లు అవుతుంది. కానీ, ఇప్పటి వరకూ పెద్దగా దీన్ని బయట పెట్టలేదు. దీనికి కారణం ఏమిటంటే.. అప్పుడు ఆయనో పెద్ద డైరెక్టర్. నేను అప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిని. నేను ఆయనపై ఆరోపణలు చేస్తే బాలీవుడ్ మాఫియా నన్ను అంతం చేసేది' అని షాకింగ్ విషయాలు చెప్పింది.


Click it and Unblock the Notifications











