twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వ్యవసాయం చేస్తున్న షెర్లీన్ చోప్రా .. శృంగార తార ఏం పండిస్తున్నదంటే..

    |

    శృంగార తార షెర్లీన్ చోప్రా జీవితాన్ని లాక్‌డౌన్ పూర్తిగా మార్చేసింది. లాక్‌డౌన్‌లో మద్యానికి, ధూమపానానికి పూర్తిగా దూరమయ్యారు. ప్రస్తుతం ఆరోగ్యంపై దృష్టిపెట్టిన ఈ హాట్ హీరోయిన్ యోగా, వర్కవుట్లతో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నది. అంతేకాకుండా తన జీవితంలో భాగమైన కిచెన్ గార్డెనింగ్‌ గురించి వెల్లడించింది. గత కొద్దినెలలుగా నా జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఆరోగ్యవంతమైన జీవనశైలిని అవలంభిస్తున్నాను అని షెర్లీన్ చోప్రా తెలిపారు.

    తన ఇంటిలో కిచెన్ గార్డెనింగ్ మొదలుపెట్టాను. పండ్లు, కూరగాయలు పండిస్తున్నాని షెర్లీన్ తెలిపింది. నాకు సేంద్రియ వ్యవసాయం అంటే చాలా ఇష్టం. నాకు చాలా అత్యంత ఇష్టంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించాను.

     Sherlyn Chopra started organic farming, says loving kitchen Garden

    కొన్ని కూరగాయల మొక్కలు నాటాను. ఇప్పుడు కిచెన్ గార్డెన్‌లో పంట చేతికి వస్తున్నది. నా గార్డెన్‌లో అరటిపళ్లు, పచ్చి మిరపకాయలు, కాకరకాయలు, టామోటాలు, తులసితోపాటు పలు ఆకు కూరలు పండిస్తున్నాను. ప్రతీ రోజు ఇంటి పంటతోనే కూరలు వండుతున్నాను అని షెర్లీన్ చెప్పారు.

    ఇదిలా ఉండగా, షెర్లీన్ కెరీర్‌పైన కూడా దృష్టిపెట్టారు. రెడ్‌షెర్ అనే సొంతంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను స్టార్ట్ చేశారు. ఈ ఫ్టాట్ ఫామ్ ద్వారా హై క్వాలిటీ షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌ను షెర్లీన్ చోప్రా రూపొందిస్తున్నారు. హైదరాబాదీ అమ్మాయిగా సుపరిచితులైన షెర్లీన్ చోప్రా బాలీవుడ్‌లో హాట్ హాట్ చిత్రాల్లో నటించారు.

    English summary
    Bollywood Sherlyn Chopra started organic farming in her home. actress shared the picture and said, "I love organic farming. It is this love of mine which has motivated me to plant a few vegetable plants in my little kitchen garden. In my kitchen garden, I have bananas, ajwain leaves (caron leaves), curry leaves, green chillies, karela (bitter gourd), tomatoes, tulsi and a few more plants which come in handy for everyday nutrition."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X