For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Shilpa Shetty.. రీల్ లైఫ్ కాదు.. రియల్ లైఫ్‌లోకి రా.. షెర్లీన్ చోప్రా ఫైర్.. రాజ్ కుంద్రా బెయిల్ తర్వాత

    |

    అశ్లీల కేసులో షెర్లిన్ చోప్రా రాజ్ కుంద్రా పై షాకింగ్ ఆరోపణలు చేసిందన్న సంగతి తెలిసిందే. తనను అడల్ట్ పరిశ్రమలోకి తీసుకువచ్చింది రాజ్ కుంద్రా అని కూడా ఆమె ఆరోపించారు. అంతే కాక రాజ్ తన ఇంట్లో బలవంతం చేయడానికి ప్రయత్నించాడని కూడా ఆమె ఆరోపించింది. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆమె ఏప్రిల్ 2021 లో రాజ్ కుంద్రా పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తాజాగా ఇప్పుడు షెర్లిన్ చోప్రా ట్విట్టర్ పోస్ట్‌లో శిల్పా శెట్టిని మరోసారి టార్గెట్ చేసింది. ఆమె ఇటీవల ఒక వీడియో ఇంటర్వ్యూ నుండి క్లిప్‌ను ఆ ట్వీట్ లో షేర్ చేశారు. శిల్ప వాస్తవ ప్రపంచంలో కూడా మార్పు తీసుకురావాలని ఆమె పేర్కొంది. ఆ వివరాల్లోకి వెళితే

    నన్ను నమ్మండి

    నన్ను నమ్మండి

    తన ట్వీట్‌లో శిల్పా మరియు ఆమె భర్త రాజ్ కుంద్రాను ట్యాగ్ చేస్తూ, షెర్లిన్ చోప్రా 'మీరు కళాకారులు, ఎవరైనా కళాకారులను చూసి ప్రభావితం అయితే వారికీ టీవీలో సాష్టాంగ నమస్కారం చేస్తారు. దయచేసి, రీల్ జీవితం నుండి బయటకు రండి, వాస్తవ ప్రపంచానికి వెళ్లండి, బాధిత మహిళలకు కొంత సానుభూతి చూపించండి, నన్ను నమ్మండి, ప్రపంచం మొత్తం మీకు నమస్కరిస్తుంది! అంటూ ఆమె రాసుకొచ్చింది.

    సాష్టాంగ పడటం చాలా సులభం

    సాష్టాంగ పడటం చాలా సులభం


    షెర్లిన్ శిల్పా శెట్టికి సలహా ఇచ్చింది షెర్లిన్ పంచుకున్న వీడియో క్లిప్‌లో, ఆమె తన పోస్ట్‌లో వ్రాసిన విషయం గురించే మాట్లాడుతుంది. వీడియోలో షెర్లిన్ శిల్పను గట్టిగానే టార్గెట్ చేసింది. సాష్టాంగ నమస్కారం చేయడం మరియు వేదికపై రాణి లక్ష్మీబాయి గురించి మాట్లాడటం చాలా సులభం, కానీ మీరు మైదానంలో ఉండాలి, రీల్ లైఫ్ కాకుండా నిజ జీవితాన్ని చూడండి, ప్రతిదీ అర్థం అవుతుంది. బాధపడుతున్న మహిళలు మరియు పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలి. మీ ఇంటి నుండి బయటకు వెళ్లి ఏదైనా చేయండి. అశ్లీల ప్రపంచం నుండి బయటకు రండి, అప్పుడు ఈ ప్రపంచం మీకు ఎలా సాష్టాంగ పడుతుందో చూడండి. అని ఆమె కామెంట్స్ చేసింది.

    షెర్లిన్ చోప్రా దేశం కోసం

    షెర్లిన్ చోప్రా దేశం కోసం

    షెర్లిన్ చోప్రా మాట్లాడుతూ, నేను దేశం కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను. ఎంతకాలం సినిమాలు చేయాలి? బాధపడుతున్న మహిళలు మరియు పిల్లల కోసం నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను. దేశం కోసం ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నేను నా దేశం కోసం ఏదైనా చేయాలనుకుంటున్నానని ఆమె పేర్కొంది.

    సాష్టాంగ పడటం చాలా సులభం

    సాష్టాంగ పడటం చాలా సులభం

    ఇక వేదికపై కూర్చుని సాష్టాంగ పడటం చాలా సులభం. వేదికపై కూర్చుని రాణి లక్ష్మీబాయి గురించి మాట్లాడటం సులభం. రంగంలోకి వెళ్లి బాధపడుతున్న మహిళల కోసం ఏదైనా చేయండి. రాజ్ కుంద్రా మరియు శిల్పా శెట్టిని గురించి మాట్లాడుతూ "మీ బంగ్లా నుండి బయటపడండి, పోర్న్ నుండి బయటపడండి, ఏదైనా చేయండి" అని కోరారు. మీరు కారు మరియు బంగ్లా కొనడానికి పోర్న్ చేస్తారా? అని ప్రశ్నించింది.

    అప్పటి నుంచి టార్గెట్ చేసి

    అప్పటి నుంచి టార్గెట్ చేసి

    ఇక అశ్లీల కేసులో రాజ్ కుంద్రా బెయిల్ పొందినప్పటి నుండి షెర్లిన్ ఏదో ఒకటి శిల్పాను టార్గెట్ చేస్తూ పోస్ట్ చేస్తోంది లేదా శిల్పా మరియు రాజ్‌కుంద్రా గురించి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. రాజ్ కుంద్రా బెయిల్ ద్వారా షెర్లిన్ చోప్రా చాలా బాధపడినట్లు తెలుస్తోంది. ఇక అశ్లీల కేసులో రెండు నెలల తర్వాత రాజ్ కుంద్రా కి బెయిల్ లభించింది. కుంద్రా అశ్లీల కేసులో జూలైలో అరెస్టయ్యాడు. ముంబై క్రైమ్ బ్రాంచ్ అతడిని 'కీలక కుట్రదారు'గా అభివర్ణించింది. ఇటీవల, కోర్టు అతనికి రూ .50, 000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.

    English summary
    Shilpa Shetty has once again been targeted by Sherlyn Chopra in a fresh tweet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X