పార్టీలలో డ్రగ్స్ అలా ఇచ్చేవారు.. కంగనపై షెర్లీన్ చోప్రా సంచలన వ్యాఖ్యలు

సెన్సేషనల్ కామెంట్స్‌తో నిత్యం వార్తల్లో నిలిచే శృంగార తార షెర్లీన్ చోప్రా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తకు మద్దతునిచ్చిన ఈ బ్యూటీ కంగన రనౌత్‌కు అండగా నిలిచారు. సినీ పరిశ్రమలో ఎవరికి అన్యాయం జరిగినా నేను మాట్లాడుతూనే ఉంటాను అని షెర్లీన్ చెప్పారు.

తాజాగా చోటుచేసుకొన్న డ్రగ్స్ వ్యవహారంపై స్పందిస్తూ.. అలాంటి నిషేదిత మాదక ద్రవ్యాలు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. వాటి నుంచి బయటపడటానికి యోగా చేసుకోవడం మంచింది. ఆరోగ్యకరమైన జీవన విధానం అవలంభించాలి అని షెర్లీన్ పేర్కొన్నారు.

Sherlyn Chopra took the stand for Kangana Ranaut

ఒకప్పుడ నేను చైన్ స్కోకర్‌ను. 2017 అక్టోబర్‌లో ధూమపానం వదలేశాను. మార్చిలో లాక్‌డౌన్‌ విధించే వరకు నేను విపరీతంగా మద్యం తీసుకొనేదానిని. లాక్‌డౌన్ సమయంలో పూర్తిగా మద్యానికి దూరమయ్యాను.

బాలీవుడ్‌లో జరిగే పార్టీలకు హాజరైన సమయంలో ప్లేట్స్‌లో డ్రగ్స్ పెట్టి ఇచ్చేవారు. అయితే ఎప్పుడూ వాటికి దూరంగానే ఉండేదానిని. డ్రగ్స్ వల్ల అనేక అనర్థాలు ఉంటాయనే విషయం నాకు మొదటి నుంచి తెలుసు అని షెర్లీన్ చోప్రా తెలిపారు.

Sherlyn Chopra took the stand for Kangana Ranaut

కంగన రనౌత్ ధైర్యశాల అంటూ షెర్లీన్ ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు. ఆమె ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. ఉక్కు లాంటి వెన్నుముకతో ఎదురొడ్డి పోరాడుతుంది. మేఘంగా గర్జించగల సత్తా ఆమెకు ఉంది అంటూ షెర్లీన్ అన్నారు.

లాక్‌డౌన్‌కు ముందు షెర్లీన్ చోప్రా తును తును అనే వీడియో ఆల్బమ్‌లో చివరి సారిగా కనిపించారు. టీ సిరీస్, షెర్లీన్ చోప్రా ప్రొడక్షన్ నిర్మించిన ఈ ఆల్బమ్కు వికీ, హర్దిక్ సంగీతం అందించగా, సుకృతి కక్కర్ ఆలపించారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లతోపాటు నిర్మాతగా, యాక్టర్‌గా, డైరెక్టర్‌గా, ర్యాపర్‌గా, సింగర్‌గా రాణించేందుకు సిద్దమవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X