For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కాబోయే భార్యను బికినీలో ఫోటో తీసిన హీరో... వైరల్ అవుతున్న పిక్!

  |

  బాలీవుడ్ ప్రేమ జంట పర్హాన్ అక్తర్, శిబానీ దండేకర్ వ్యవహారం కొన్ని రోజులుగా హిందీ సినీ సర్కిల్‍‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ, విదేశీ టూర్లలో ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తమపై ఎప్పుడూ మీడియా ఫోకస్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.

  ప్రేమించుకోవడంలో తప్పు లేదు కానీ... వీరి వ్యవహారం మరీ బరితెగింపుగా ఉందని, ఇద్దరు ఆడపిల్లకు తండ్రిగా ఉన్న పర్హాన్ తన భార్యకు విడాకులు ఇచ్చి ఇలా ప్రియురాలితో జల్సాలు చేయడం ఏమీ బాగోలేదని, కాస్త డీసెన్సీ ప్రదర్శిస్తే బావుండేదనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.

  ఆ ఫోటో తీసింది అతడే

  ఆ ఫోటో తీసింది అతడే

  తాజాగా శిబానీ దండేకర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన 2 పీస్ బికినీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటో తీసింది ఎవరో ఫోటోగ్రాఫర్ అయితే ఇంత పెద్ద చర్చ జరిగేది కాదు కానీ... స్వయంగా పర్హాన్ అక్తర్ ఆమెను తన కెమెరాలో సెక్సీగా బంధించడంతో అదో పెద్ద న్యూస్ అయింది.

  ఈ క్రెడిట్ నా చెలికాడికే దక్కుతుంది అంటూ...

  ఈ క్రెడిట్ నా చెలికాడికే దక్కుతుంది అంటూ...

  శిబానీ దండేకర్ పోస్ట్ చేసిన ఈ పిక్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇలాంటి రెస్పాన్స్ ముందే ఊహించిన ఆమె... ఫోటో క్రెడిట్ తన ప్రియుడికే దక్కుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు శిబానీ దండేకర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేసిన అన్ని పోస్టుల కంటే ఇదే సూపర్ హాట్ పిక్.

  పర్హాన్ వ్యవహారంతో ఇబ్బంది పడుతున్న ఫ్యామిలీ

  పర్హాన్ వ్యవహారంతో ఇబ్బంది పడుతున్న ఫ్యామిలీ

  పర్హాన్ అక్తర్ ఇద్దరు ఎదిగిన ఆడపిల్లలకు తండ్రి. అతడు తన జీవితాన్ని సంతోషంగా, ఇష్టం వచ్చినట్లు గడిపే హక్కు ఉంది కానీ, ఇలా ప్రియురాలితో కలిసి జల్సాలు చేస్తూ, ఆ ఫోటోలను సోషల్ మీడియా వరకు వచ్చేలా చేసుకోవడం బాలేదని, వీరి వ్యవహారం వల్ల కుటుంబ సభ్యులు ఇబ్బందిగా ఫీలవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

  సోషల్ మీడియాలో శిబానీ

  సోషల్ మీడియాలో శిబానీ

  శిబానీ దండేకర్‌‌ సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్. తనకు సంబంధించిన ప్రతి అంశం సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకునే అలవాటు ఉంది. ఈ క్రమంలో పర్హాన్‌తో గడిపిన అన్ని ఫోటోలను ఆమె షేర్ చేయడం మొదలు పెట్టారు. ఆమెకు ఉన్న ఈ అవాటే వారి రసహ్యం ప్రేమాయణు బట్టబయలు అయ్యేలా చేసింది.

  త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు

  త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు

  పర్హాన్ అక్తర్, శిబానీ దండేకర్ 2019 చివరకల్లా పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట. తన మొదటి భార్య అధునా భబానీతో పర్హాన్ 2016లో విడిపోయిన సంగతి తెలిసిందే. 2017లో శిబానీతో ఏర్పడిన స్నేహం 2018లో ప్రేమగా మారింది. ప్రస్తుతం ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత డీప్ రిలేషన్లో ఉన్నారు.

  పర్హాన్ అక్తర్

  పర్హాన్ అక్తర్

  పర్హాన్ అక్తర్ సినిమాల విషయానికొస్తే... తన ఎక్సెల్‌ ఎంటర్టెన్మెంట్స్ బేనర్ ద్వారా పలు బాలీవుడ్ చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరో వైపు నటుడిగా కూడా తన ప్రస్తానం కొనసాగిస్తున్నారు. త్వరలో ‘స్కై ఈజ్ పింక్' చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దీని రత్వాత రాకేష్ ఓం ప్రకాస్ మెహ్రీ రూపొందించే ‘తూఫాన్' చిత్రంలో బాక్సర్ పాత్రలో నటించబోతున్నాడు.

  English summary
  Farhan Akhtar Lover Shibani Dandekar has come up with yet another sizzling picture which captures her hot bikini body and all credit goes to her beau Farhan Akhtar. Recently, Shibani shared her bikini picture on her Insta handle. She captioned the snap, "#beachbum #thatbrowngirl body by drewnealpt #bodybydrewneal photo by faroutakhtar outfit by hm #nofilter Monday’s!"
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X