శివానీ దండేకర్ వికీ పేజ్ హ్యాక్... బహుభర్తల పర్వమంటూ వ్యాఖ్యలు
డ్రగ్స్ కుంభకోణంలో రియా చక్రవర్తి అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఆమెకు అత్యంత సన్నిహితురాలైన శివానీ దండేకర్ ట్విట్టర్ లో సాక్షిగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండేపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. రియా అరెస్ట్ అయినప్పడు అంకిత న్యాయం జరిగిందని చేసిన ట్వీట్ పై మండిపడిన శివానీ, పలు అమర్యాదక పూర్వ ట్వీట్లతో అంకితను కించపరిచేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ నేపథ్యంలో సుశాంత్ అభిమానుల ఆగ్రహానికి గురైన శివానీ, ఇప్పుడు వారి నుంచి తారాస్థాయిలో విమర్శలను ఎదుర్కొంటోంది. ఇక్కడితో సరిపెట్టుకోని సుశాంత్ ఫ్యాన్ క్లబ్ శివానీ వీకీపీడియా పేజ్ ను హ్యాక్ చేసి, ఆమె గురించిన పలు ఘాటు విమర్శలు చేశారు.

శివానీ ఓ అవకాశవాది అంటూ పేర్కొంటూ, ఆమె ఫర్హాన్ అక్తర్ తో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటుూనే ఇతరులతోనూ సంబంధాలు కొనసాగిస్తోందంటూ విమర్శించారు. ఆమె స్థాయి కేవలం ఫర్హాన్ అక్తర్ ప్రేయసేనంటూ దుమ్మెత్తిపోశారు. అమెరికాలో టీవీయాంకర్ గా ఫ్లాప్ అయిన కెరీర్ ను వదిలిపెట్టి బాలీవుడ్ కు చేరుకున్న శివానీ ఫర్హాన్ అక్తర్ పై పరాన్న జీవిగా వాలిపోయిందని విమర్శించారు.
ఫర్హాన్ కు తాత్కాలిక గర్ల్ ఫ్రెండ్ గా పనిచేస్తూనే.. అప్పుడప్పుడూ ట్విట్టర్ లో చెత్త రాస్తుంటుందని, నేరస్థులకు మద్దతుగా నిలుస్తూ పేరు సంపాదించుకోవాలని ప్రయత్నిస్తుందంటూ వీకీపీడియా పేజ్ లో రాశారు. ఈ హ్యాక్ పై సత్వరమే స్పందించిన వీకీపీడియా, వెంటనే ఆ రాతలను తొలిగించి పేజ్ ను రీ ఫ్రెష్ చేశారు. దీనిపై శివానీ ఇంకా స్పందించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











