For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజ్ కుంద్రా కేసు తరువాత మళ్ళీ ఆదాయం పెంచుకుంటున్న శిల్పా శెట్టి.. మళ్ళీ ఎప్పటిలానే రెమ్యునరేషన్!

  |

  బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి భర్త కారణంగా పోలీసుల విచారణలో పాల్గొన్న విషయం తెలిసిందే. పోర్న్ వీడియోలతో బిజినెస్ చేయడమే కాకుండా బలవంతంగా నీలి చిత్రాలను షూట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కోవడంతో ఒక్కసారిగా ఆ వార్తలు దేశమంతా వైరల్ అయ్యాయి. ఇక దాని వల్ల మొదటిసారి శిల్పాశెట్టి ఊహించని చేదు అనుభవాలు ఎదుర్కొంది. ఇక ఆ చేదు అనుభవం నుంచి బయటపడేందుకు ఎంతగానో కృషి చేస్తోంది. కానీ ఆమె బయటపడాలని ప్రయత్నం చేసినా కూడా నేషనల్ మీడియాలో వార్తలు ఇంకా బాధకు గురి చేస్తూనే ఉన్నాయి. ఇక శిల్పా శెట్టి మీడియాపై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తన పిల్లలకు కూడా ప్రైవసీ ఇవ్వాలని ఎమోషనల్ గా ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఇక ఆమ్స్ మళ్ళీ తన రెగ్యులర్ పనులతో బిజీ అయ్యే విధంగా అడుగులు వేస్తోంది. మళ్లీ తన ఆదాయాన్ని పెంచుకునే రియాల్టీ షోలలో కూడా పాల్గొంటోంది.

  Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu
   సెకండ్ ఇన్నింగ్స్ లో

  సెకండ్ ఇన్నింగ్స్ లో

  బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ గా ఒకప్పుడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న శిల్పా శెట్టి హీరోయిన్ గా కెరీర్ కు ముగింపు కార్డ్ పెట్టిన అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్కువగా రియాలిటీ షోలతోనే బిజీగా మారుతోంది. వెండి తెరపై కనిపించిన కనిపించకపోయినా కూడా బుల్లితెరను మాత్రం వదల్లేదు. చాలా మంది హీరోయిన్స్ వారి సెకండ్ ఇన్నింగ్స్ లో టెలివిజన్ లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు వస్తున్నా కూడా ఈ రంగంలోనే చాలా హ్యాపోగా ఉందని అలాగే మంచి ఆదాయం పెంచుకునే అవకాశం ఆఫర్స్ వచ్చిన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

   కాంట్రవర్సి లేకుండా

  కాంట్రవర్సి లేకుండా

  వీలైనంత వరకు కాంట్రవర్సి లేకుండా షోలను కొనసాగించాలని సీనియర్ నటీనటులు అడుగులు వేస్తున్నారు. శిల్పాశెట్టి కూడా గతంలో కొన్ని రియాలిటీ షోలలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆమె సూపర్ డాన్స్ ఫోర్ లో కూడా ఒక ప్రత్యేకమైన జడ్జి గా కనిపిస్తున్నారు. 'సూపర్ డాన్సర్ 4' షూటింగ్ కోసం శిల్పా శెట్టి ఇటీవల సెట్స్ కు తిరిగి వచ్చింది. మొన్నటి వరకూ పోలీసుల విచారణలో బిజీగా ఉన్న శిల్పాశెట్టి ఇంటి నుంచి బయటకు రావడానికి కాస్త ఇబ్బందులు ఎదుర్కొంది.

  అందులో ఎలాంటి నిజం లేదని..

  అందులో ఎలాంటి నిజం లేదని..

  శిల్పాశెట్టి భర్త పై అలాంటి కేసు నమోదు అయిన తర్వాత ఆమె కెరీర్ పై కూడా ప్రభావం పడినట్లు టాక్ అయితే వచ్చింది. ఆమెను రియాల్టీ షో నుంచి నుంచి కూడా తీసి వేసినట్లు ఎన్నో కథనాలు వెలువడ్డాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఇటీవల విడుదలైన ఒక వీడియో ద్వారా క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే శిల్పా శెట్టి ఇటీవల సూపర్ డాన్స్ ఫోర్ 4 రియాల్టీ షో లో ప్రత్యేకమైన జడ్జిగా పాల్గొంది. అందుకే సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

  అదే రెమ్యునరేషన్

  అదే రెమ్యునరేషన్

  అయితే ఆమె సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వగానే కొన్ని ఎమోషనల్ గా కూడా ఫీల్ అయ్యింది. శిల్పాశెట్టి భర్త కారణంగా వివాదంలో చిక్కుకున్న అనంతరం నిర్వాహకులు ఆమెను తీసివేయాలని అనుకోలేదట. ఎప్పటికప్పుడు శిల్పాశెట్టి వారు సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ మధ్య మరో ఇద్దరు స్టార్ హీరోయిన్ల కోసం ప్రత్యేకంగా పిలవడంతో మళ్లీ సూపర్ డాన్స్ ఫోర్ లోకి రాదేమో అని అంతా అనుకున్నారు. ఆ విషయంపై పలు రకాల రూమర్స్ కూడా వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఇటీవల విడుదలైన ఒక వీడియో అర్థమైంది. ఇక ఎప్పటిలానే ఆమెకు నిర్వాహకులు సరైన పారితోషికం ఇస్తూ షోను కొనసాగిస్తున్నట్లు సమాచారం.

  English summary
  Shilpa shetty back to work after long time with same remuneration
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X