పోర్న్ చిత్రాల కేసులో ఇరుక్కున్న శిల్పా శెట్టి భర్త.. అర్ధరాత్రి అడ్డంగా దొరికి పోవడంతో..

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా మరో కేసులో ఇరుక్కున్నాడు. అర్ధరాత్రి సడన్ గా ముంబై పోలీసులు అరెస్ట్ చేయడంతో నేషనల్ మీడియాలో విషయం ఒక్కసారిగా వైరల్ అయ్యింది. అశ్లీల కంటెంట్ తయారు చేసి మొబైల్ యాప్‌ల ద్వారా ప్రచురించారనే ఆరోపణలతో రాజ్ కుంద్రాను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. పక్కా ఆధారాలతోనే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఈసారి ఏకంగా పోర్న్ సినిమాల చిక్కుల్లో

ఈసారి ఏకంగా పోర్న్ సినిమాల చిక్కుల్లో

బాలీవుడ్ మాజీ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా నిత్యం ఏదో ఒక చట్టపరమైన కేసులో ఇరుక్కుంటునే ఉన్నారు. గతంలోనే ఆర్థిక లావాదేవీల్లో ఇన్వెస్టిగేషన్ కు గురయ్యారు. అలాగే పలు చీటింగ్ కేసులతో కూడా సతమతమయ్యారు. ఇక ఈసారి ఏకంగా పోర్న్ సినిమాల చిక్కుల్లో పడటం హాట్ టాపిక్ గా మారింది.

ఫిబ్రవరిలో రాజ్ కుంద్రాపై కేసు

ఫిబ్రవరిలో రాజ్ కుంద్రాపై కేసు

ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజ్ కుంద్రాపై కేసు నమోదైందని, ఆ ఫిర్యాదు ఆధారంగా ఈ అరెస్టు జరిగిందని ముంబై పోలీసు కమిషనర్ హేమంత్ నాగ్రేల్ వెల్లడించారు. ఈ కేసుపై ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ సిఐడి ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. గతంలోనే రాజ్ కుంద్రాపై చాలాసార్లు ఈ తరహా ఆరోపణలు వచ్చినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

మొబైల్ యాప్స్ ద్వారా

మొబైల్ యాప్స్ ద్వారా

అశ్లీల చిత్రాలను షూట్ చేసి వాటిని మొబైల్ యాప్స్ ద్వారా ఓటీటీ తరహాలో రిలీజ్ చేసుగున్నారని క్రైమ్ బ్రాంచ్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో రాజ్ కుంద్రా కీలక కుట్రదారుడిగా ఉన్నందున అతన్ని అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. దీనికి సంబంధించి తగిన ఆధారాలు ఉన్నాయని కూడా అధికారులు వివరణ ఇచ్చారు.

ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు

ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు

ఇక ముందస్తు బెయిల్ కోసం రాజ్ కుంద్రా దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. తాను ఎలాంటి తప్పు చేయలేదని రాజ్ కుంద్రా మీడియాకి తెలుపుతూ.. అనవసరంగా తనపై తప్పుడు ఆరోపణలతో కేసులో ఇరికించారని మీడియాకు వివరణ ఇచ్చారు. వివిధ రకాల బిజినెస్ లతో కూడా కొనసాగిన రాజ్ కుంద్రా ప్రతిసారి ఎదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్నాడు. శిల్పాశెట్టితో అతనికి 2009లో వివాహం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X