శిల్పాశెట్టి కుటుంబం మొత్తానికి కరోనా.. చిన్న పిల్లల్ని కూడా వదలని కోవిడ్ భూతం!
దేశవ్యాప్తంగా ఎంతో మంది జీవితాలను కరోనావైరస్ విచ్ఛిన్నం చేస్తున్నది. ఈ ప్రమాదకరమైన వ్యాధి బారిన పడి ఎంతో మంది సాధారణ ప్రజలు, సెలబ్రిటీలు సతమతమవుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కుంద్రా ఫ్యామిలీ కూడా కరోనావైరస్ కాటుకు గురైంది. తాజాగా తన కుటుంబంలోని చాలా మందికి కరోనావైరస్ సోకిందని తన ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడిస్తూ...

నా అత్తమామ, భర్త, పిల్లలకు కరోనా
నా కుటుంబంలో నా అత్తమామ, నా పిల్లలు వియాన్, సంహిష, నా భర్త రాజ్ కుంద్రాకు కొద్ది రోజుల క్రితం కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కానీ నాకు కరోనావైరస్ నెగిటివ్ అని వైద్యులు నిర్ధారించారు అని శిల్పాశెట్టి తెలిపారు.

డాక్టర్ల సలహాతో ట్రీట్‌మెంట్
నా కుటుంబ సభ్యులందరూ గత 10 రోజులగా చాలా కష్టాలను అనుభవించారు. కుటుంబ మొత్తం ఒకేసారి కరోనావైరస్ బారిన పడటంతో షాక్ గురయ్యాను. రాజ్ కుంద్రా, వియాన్, సంహిష ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో సలహాలు, సూచనలు పాటిస్తూ ట్రీట్‌మెంట్ తీసుకొంటున్నారు అని శిల్పాశెట్టి వెల్లడించారు.

నా వ్యక్తిగత సిబ్బందికి కూడా కోవిడ్
నా కుటుంబ సభ్యులందరూ ఇలా బాధపడుతుంటే నా సిబ్బందిలో చాలా మందికి కూడా కరోనా సోకింది. వారిని ముంబైలోని హాస్పిటల్‌లో చేర్పించి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నాను అని చెప్పింది. అభిమానులకు తన ఆరోగ్యం గురించి అన్ని వివరాలు చెబుతూ తన పోస్టులో విషయాలను వెల్లడించారు.

నాకు నెగిటివ్ వచ్చిందంటూ..
భగవంతుడి దయ వల్ల నా కుటుంబ సభ్యులు, సన్నిహితులందరూ కరోనా నుంచి కోలుకొంటున్నారు. ఇటీవల పరీక్ష చేసుకోగా నాకు నెగిటివ్ అని తేలడంతో ఊపిరి పీల్చుకొన్నాను. బీఎంసీ అధికారులు ప్రోటోకాల్స్‌ను పాటిస్తున్నాం. అధికారుల సహాయ చర్యలు బాగున్నాయి అంటూ శిల్పాశెట్టి పేర్కొన్నారు.
Recommended Video

అభిమానులకు ధన్యవాదాలు
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నాకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చి అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. మీ ప్రార్థన వల్లే మా కుటుంబం సత్వరంగా కోలుకొంటున్నారు. ఈ సమయంలో ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించండి. శానిటైజ్ చేసుకొంటూ సురక్షితంగా ఉండండి అంటూ శిల్పాశెట్టి ఇన్స్‌టాగ్రామ్ ద్వారా కోరారు.


Click it and Unblock the Notifications











