twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Raj Kundra జైలు నుంచి విడుదల.. సోషల్ మీడియాలో శిల్పాశెట్టి సంచలన వ్యాఖ్యలు

    |

    దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పోర్న్ రాకెట్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు ముంబైకి చెందిన మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోర్నోగ్రఫి రాకెట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రాను జూలై 19వ తేదీ అర్ధరాత్రి అరెస్ట్ చేయడం బాలీవుడ్‌లో సంచలనం రేపింది. భర్త రాజ్ కుంద్రా‌కు బెయిల్ లభించిన తర్వాత శిల్పాశెట్టి తన అధికారిక ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఓ పోస్ట్ పెట్టి భావోద్వేగంగా స్పందించారు.

    ఈ కేసు వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్‌లో సంచనలం రేపిన పోర్న్ రాకెట్ కేసుకు సంబంధించి.. మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ సెప్టెంబర్ 15వ తేదీన సుమారు 1500 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసింది.

    Chiranjeevi తో స్టెప్పులేసి ఇరుగదీసిన సాయిపల్లవి .. అమీర్ ఖాన్‌ ఎమోషనల్‌గాChiranjeevi తో స్టెప్పులేసి ఇరుగదీసిన సాయిపల్లవి .. అమీర్ ఖాన్‌ ఎమోషనల్‌గా

    Shilpa Shetty husband Raj Kundra released from Arthur Road jail in Porn Rocket Case

    అయితే తనను ఈ కేసులో బలి పశువుగా చేశారు. ఈ కేసుతో సంబంధాలు ఉన్నట్టు ఏ ఒక్క ఆధారం నాపై లేదు. కాబట్టి నాకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో దాఖలు చేసిన సప్లిమెంట్ పిటిషన్‌లో కూడా తనకు సంబంధమున్నట్టు ఆధారాలు లేవు అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

    చీఫ్ మొట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎస్‌బీ భాజీపాలేకు రూ.50 వేల పూచీకత్తు బాండ్ సమర్పించిన తర్వాత రాజ్ కుంద్రాను మంగళవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఆర్థర్ రోడ్ జైలు నుంచి విడుదల చేశారు. గత జూలై 19వ తేదీ నుంచి రాజ్ కుంద్రా ఈ జైలులోనే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రాజ్ కుంద్రాతోపాటు ర్యాన్ థోర్ప్‌ను కూడా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

    ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన శ్రీముఖి: ఎద అందాలు కనిపించేంత ఘాటుగా.. ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరుఓ రేంజ్‌లో రెచ్చిపోయిన శ్రీముఖి: ఎద అందాలు కనిపించేంత ఘాటుగా.. ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు

    Shilpa Shetty husband Raj Kundra released from Arthur Road jail in Porn Rocket Case

    అయితే తన భర్త రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు చేశారనే వార్త తెలిసిన వెంటనే ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందిస్తూ.. భారీ తుఫాన్ తర్వాత ఓ అందమైన ఇంద్రధనుసు కనిపిస్తుంది. అది అద్భుతమైన విషయాలకు నిదర్శనం అంటూ శిల్పాశెట్టి భావోద్వేగంగా స్పందించారు.

    గత కొద్దిరోజులుగా అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న శిల్పాశెట్టికి జీవితంలో మంచి శకునాలు కనిపిస్తున్నాయి సోదరి షమితాశెట్టి బిగ్ బాస్ ఓటీటీ లో తన ప్రతిభను చాటుకొని ప్రేక్షకుల నుంచి మరింత గుర్తింపు పొందడం తెలిసిందే. తన సోదరి టాలెంట్‌ను ప్రశంసిస్తూ శిల్పాశెట్టి ఇన్స్‌టాగ్రామ్‌లో ఎమోషనల్ అయ్యారు.

    English summary
    Bollywood actress Shilpa Shetty husband Raj Kundra released from Arthur Road jail in Porn Rocket Case. RajKundra was released from the Arthur Road jail after Mumbai court approved a surety of Rs 50,000.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X