Raj kundra Arrest: అప్పటి వరకు పోలీస్ కస్టడీలో రాజ్ కుంద్రా.. గుట్టు లాగేందుకు జెట్ స్పీడ్ ఇన్వెస్టిగేషన్!
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కొత్త కేసు మరింత సిరియాస్ గా మారనున్నట్లు తెలుస్తోంది. మీటూ అనంతరం, నెపోటీజమ్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో మళ్ళీ ఆ స్థాయిలో రాజ్ కుంద్రా పార్న్ సినిమాల బాగోతం ప్రకంపనలు సృష్టిస్తోంది. అర్ధరాత్రి సడన్ గా ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేయడంతో ఉదయమే బాలీవుడ్ మొత్తం షాక్ అయ్యింది. ఇక పోలీసులు విచారణను వేగవంతం చేసే క్రమంలో మరికొన్ని రోజులు రాజ్ కుంద్రాను అదుపులోకి తీసుకొనున్నారు.

బూతు సినిమాలు యాప్‌ల ద్వారా
నేషనల్ మీడియాలో రాజ్ కుంద్రా అశ్లీల సినిమాల విషయం ఒక్కసారిగా వైరల్ అయ్యింది. అశ్లీల కంటెంట్ తయారు చేసి మొబైల్ యాప్‌ల ద్వారా ప్రచురించారనే ఆరోపణలతో రాజ్ కుంద్రాను పోలీసుల అదుపులోకి తీసుకోవడంతో సినిమా ఇండస్ట్రీలో వైబ్రేషన్స్ మొదలయ్యాయి. రాజ్ కుంద్రా వెనకాల ఇంకా ఎంత మంది ఉన్నారు అనే విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

గత ఫిబ్రవరి నెల నుంచి
గత ఫిబ్రవరి నెల నుంచి రాజ్ కుంద్రాపై ఇలాంటి ఆరోపనలు రాగా పోలీసులు పక్కా ఆధారాలతోనే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా గతంలోనే అనేక రకాల వివాదాలతో మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఏకంగా పోర్న్ సినిమాల చిక్కుల్లో పడటం అతనికి ఊపిరాడనివ్వడం లేదు.

అప్పటి వరకు పోలీస్ కస్టడీలోనే
ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటి రాజ్ కుంద్రా ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే జూలై 23 వరకు రాజ్ కుంద్రా పోలీస్ కస్టడీలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక గ్యాప్ లేకుండా ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.

ఏ మాత్రం పట్టు దొరికినా..
ఈ మాఫియాలో కేవలం రాజ్ కుంద్రా పేరు మాత్రమే ఎక్కువగా వినిపిస్తోంది. కానీ అధికారులు ఇంకా ఎవరైనా బిగ్ స్టార్స్ ఉన్నరేమో అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏ మాత్రం పట్టు దొరికినా కూడా పోలీసులు వదిలిపెట్టాలని అనుకోవడం లేదట. మరింత గుట్టు లాగేందుకు రాజ్ కుంద్రాను విచారించనున్నారు. మరి ఈ కేసులు ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











