రాజ్ కుంద్రాపై 1.51 కోట్ల చీటింగ్, ఫోర్జరీ కేసు.. పెదవి విప్పిన శిల్పాశెట్టి

అశ్లీల వీడియో చిత్రీకరణ కుంభకోణం వివాదం నుంచి ఇంకా పూర్తిగా బయట పడకుండానే శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా మరో వివాదంలో ఇరుక్కుపోయారు. ఫోర్జరీ చేసి తనను కోట్లాది రూపాయల చీటింగ్‌కు పాల్పడ్డారని ఓ వ్యాపారవేత్త ఖషీష్ ఖాన్ కేసు నమోదు చేయడం బాలీవుడ్ మీడియాలో సంచలనం రేపింది. దాదాాపు రూ.1.51 కోట్ల మేరు చీటింగ్ చేశారనే ఆరోపణలపై బాధితుడు కేసు నమోదు చేయడం గమనార్హం. అయితే తనపై, తన భర్తపై వచ్చిన ఆరోపణలపై తాజాగా శిల్పాశెట్టి స్పందించారు. వ్యాపారవేత్త చేసిన ఫోర్జరీ, చీటింగ్ ఆరోపణలు ఆమె ఖండించారు.

ఖషీష్ ఖాన్ తన ఫిర్యాదులో.. ఫోర్జరీ ఆరోపణలు చేస్తూ.. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా కంపెనీ పేరు చెప్పి దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్ల నుంచి నిధులు సేకరించారు. అయితే ఆ నిధులను తిరిగి ఇవ్వాలని కోరితే.. తనపై బెదిరింపులకు పాల్పడ్డారు. తనకు రూ.1.51 కోట్ల నష్టం జరిగింది వాటిని తిరిగి ఇప్పించేలా కేసు నమోదు చేశాను అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 Shilpa Shetty opened about 1.51 crore cheating, Forgery case on Raj Kundra

శిల్పాశెట్టి ఓ ప్రకటనను విడుదల చేసి.. మాపై ఎఫ్‌ఐఆర్ నమోదైందనే వార్తతో నిద్రలేచి దిగ్బ్రాంతికి గురయ్యాం. కాషిఫ్ ఖాన్ నిర్వహించే ఎస్ఎఫ్ఎల్ ఫిట్‌నెస్ సెంటర్ ఆర్థిక లావాదేవీలు, ఖాతా పుస్తకాలన్నీ సరిగానే ఉన్నాయి. అందులో ఎలాంటి లోటుపాట్లు, అవకతవకలు లేవు. ఎస్ఎఫ్ఎల్ బ్రాండ్ రైట్స్ తీసుకొని దేశవ్యాప్తంగా సెంటర్లను నెలకొల్పడానికి ప్లాన్ చేసుకొన్నాడు. అయితే డీల్స్ అన్నీ ఆయన కారణంగా బ్రేక్ అయ్యాయి. బ్యాంకు లావాదేవీల విషయంలో ఆయన బాధ్యుడిగా ఉన్నారు. ఈ లావాదేవీల విసయంలో ఇప్పటి వరకు ఒక్కపైసా తీసుకోలేదు. ఆ వ్యవహారాల్లో ఏం జరుగుతున్నదనే విషయం మాకు తెలియదు. ఖాషిఫ్ మాత్రమే అన్నీ డీల్ చేస్తున్నాడు. ఖాషిష్ ఖాన్ పర్యవేక్షణలో నడిచే ఫిట్‌నెస్ సెంటర్ 2014లోనే క్లోజ్ అయింది అని శిల్పాశెట్టి తెలిపారు.

సినిమా పరిశ్రమలో గత 28 ఏళ్లుగా కష్టపడి పనిచేసి పరువు, ప్రతిష్టలను సంపాదించుకొన్నాను. ఇలాంటి ఆరోపణల వల్ల అలాంటివి దెబ్బ తిన్నాయి. ఇలాంటి అరోపణలన్నీ పబ్లిసిటీ కోసమే. నేను చట్టాలను గౌరవిస్తాను., న్యాయవ్యవస్థపై అంచంచల గౌరవం ఉన్న ఈ దేశ పౌరురాలిని అంటూ శిల్పశెట్టి ఎమోషనల్‌గా పోస్టు పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X