శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా విడాకులు.. రహస్యంగా ఫోన్ తీసుకుని!

Recommended Video

Anurag's Prank On Shilpa Shetty And Raj Kundra || Filmibeat Telugu

పొడుగు కాళ్ళ సుందరి శిల్పా శెట్టి 2009లో ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాని వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఓ కొడుకు కూడా జన్మించాడు. వీరిద్దరు ఒకరికి ఒకరు అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే విడాకులు ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. ఇందులో కంగారు పడాల్సింది లేదు. బాలీవుడ్ సీనియర్ దర్శకుడు అనురాగ్ బసు వల్లే శిల్పా శెట్టి వార్తల్లో నిలిచింది. అనురాగ్ బసు కొన్ని నిమిషాల పాటు శిల్పా శెట్టి కుటుంబ సభ్యులని కంగారుపెట్టేశాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం!

సూపర్ డాన్సర్ 3 షోలో

సూపర్ డాన్సర్ 3 షోలో

శిల్పా శెట్టి, అనురాగ్ బసు, గీతా కపూర్ సూపర్ డాన్సర్ 3 షోకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల షో జరుగుతున్న సమయంలో అనురాగ్ బసు శిల్పా శెట్టిని ఆటపట్టించాలని అనుకున్నాడు. అతడు చేసిన పనికి శిల్పా కుటుంబ సభ్యులు అంతా కొంతసేపు ఆందోళనకు గురయ్యారు. అనురాగ్ చేసిన పనిని గుర్తించిన శిల్పా వెంటనే స్పందించడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

 శిల్పా తల్లికి మెసేజ్

శిల్పా తల్లికి మెసేజ్

శిల్పా శెట్టి ఫోన్ ని రహస్యంగా తీసుకున్న అనురాగ్ బసు ఆమె తల్లికి నేను, రాజ్ కుంద్రా విడాకులు తీసుకుంటున్నట్లు, మా మధ్య పెద్ద గొడవ జరిగినట్లు మెసేజ్ పెట్టాడు. దీనితో శిల్పా శెట్టి కుటుంబ సభ్యులు అసలేం జరుగుతుందో అర్థం కాక ఆందోళనకు గురయ్యారు. అనురాగ్ బసు చేసిన నిర్వాకాన్ని పక్కనే ఉన్న గీతా కపూర్ ఆమెకు వివరించింది. దీనితో అనురాగ్ చేతుల్లో ఉన్న తన ఫోన్ ని లాక్కుని తన తల్లికి ఫోన్ చేసింది. కంగారు పడాల్సిందేమీ లేదు. ఇదంతా అనురాగ్ బసు నాకు తెలియకుండా చేసిన నిర్వాకం అని వివరించింది.

 నేను చెప్పే వరకు నమ్మొద్దు

నేను చెప్పే వరకు నమ్మొద్దు

నా గురించి గర్భవతిని, విడిపోతున్నాను ఇలాంటి వార్తలు ఏమొచ్చినా నేను చెప్పే వరకు నమ్మొద్దు అని శిల్పా తన తల్లికి వివరించింది. ప్రస్తుతం శిల్పా శెట్టి సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. కానీ ఆమె చేతి నిండా టివి షోలు ఉన్నాయి. పలు టివి షోలతో శిల్పా శెట్టి బిజీగా గడుపుతోంది. శిల్పా శెట్టి తరచుగా తన ఫ్యామిలీతో వెకేషన్స్ లో సందడి చేస్తూ ఉంటుంది. 43 ఏళ్ళు వచ్చినా చెక్కు చెదరని అందం శిల్పా శెట్టి సొంతం.

సినిమాలకు దూరమై

సినిమాలకు దూరమై

శిల్పా శెట్టి వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. సాహసవీరుడు సాగర కన్య, ఆజాద్, బలేవాడివి బాసు లాంటి తెలుగు చిత్రాల్లో శిల్పా శెట్టి నటించింది. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించే విషయం గురించి శిల్పా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్పట్లో తనకు ఆ ఆలోచన లేదని వివరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X