విడాకులకు సిద్ధంగా మరో సినీ జంట.. రిస్క్ లేకుండా ముందే ఆస్తుల పంపకాలు?
ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో అనేక జంటలు విడిపోతున్నారు. ఈ ప్రేమ పెళ్లిళ్లు ఆ తర్వాత విడాకులు చాలా కామన్ గా మారిపోయాయి. మరీ ముఖ్యంగా ఈ లాక్ డౌన్ తర్వాత విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు మరో జంట విడాకులకి సిద్ధం అయింది అంటూ చెబుతున్నారు. ఆ వివరాలు

అన్ని ఇండస్ట్రీలలో
ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో అనేక జంటలు తమ వైవాహిక జీవితాలకు గుడ్ బై చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ లో మొదలైన ఈ వ్యవహారం తెలుగుకు వరకు వచ్చి తమిళ సినీ పరిశ్రమ దాకా వెళ్ళింది. కొన్నేళ్ల సంబంధానికి విడాకుల పేరుతొ గుడ్ బై చెబుతున్నారు.

అమీర్ ఖాన్ మొదలు
ముందుగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ - నిర్మాత కిరణ్ రావ్ జంట తమ 15 ఏళ్ల బంధానికి విడాకులు తీసుకుని గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత కొన్నాళ్లకు స్టార్ కపుల్ అక్కినేని నాగ చైతన్య - సమంత తమ నాలుగేళ్ల వివాహ బంధానికి విడాకులతో ముగింపు పలికారు. ఈ విషయాన్ని గతేడాది అక్టోబర్ లో ప్రకటించారు.

ఇమ్మాన్ కూడా
ఆ తరువాత తమిళ మ్యూజిక్ డైరెక్టర్ డి.ఇమ్మాన్ తన భార్య మోనికా రిచర్డ్ తో విడిపోయినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.ఏడాది క్రితమే విడిపోయామని ఇప్పుడు అధికారికంగా చెబుతున్నామని పేర్కొన్నారు. ఇవి కాక మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్.. యువ మోడల్ రోహమన్ షాల్ తో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తూ రాగా ఇక మీదట మేము కలసి ఉండబోమని.. బ్రేక్ అప్ చెప్పుకుంటున్నామని కటించారు.

శిల్పాశెట్టి - రాజ్ కుంద్రా విడిపోతున్నారా
వీరి తరువాత తమిళ స్టార్ హీరో ధనుష్ - రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య కూడా తమ 18 ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సంయుక్త ప్రకటన రిలీజ్ చేసి షాక్ ఇచ్చారు. ఇక చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే టాలీవుడ్ సీనియర్ హీరో ఒకరు విడాకులు తీసుకోబోతున్నట్టు చెబుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే సినీ జంట శిల్పాశెట్టి - రాజ్ కుంద్రా విడిపోతున్నారని జాతీయ మీడియాలో కథనాలు మొదలయ్యాయి. రాజ్ కుంద్రా పోర్న్ కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్లిన సమయంలో శిల్పాశెట్టి - రాజ్ కుంద్రా జంట విడిపోవచ్చని ప్రచారం జరగ్గా దాన్ని శిల్ప వాటిని ఖండించారు.

ఆస్తుల బదలాయింపు
అయితే ఇప్పుడు మళ్లీ అదే వార్త ప్రచారంలోకి వచ్చింది. దీనికి కారణం రాజ్ కుంద్రా తాజాగా 39కోట్ల రూపాయల విలువైన ఆస్తులను శిల్పాశెట్టి పేరుపై బదలాయించారు. దాదాపు రూ.39 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌లోని మొదటి అంతస్తు మొత్తాన్ని రాజ్‌కుంద్రా శిల్పాశెట్టి పేరుపై మార్చారు. కినారాలోని బీచ్ వ్యూలో ఉన్న అపార్ట్ మెంట్ తో పాటు రాజ్ కుంద్రా ఫామ్ హౌస్ కు కూడా ఆమె పేరునే మార్చినట్టు సమాచారం. విడిపోయే ఉద్దేశంతోనే భార్యాభర్తల మధ్య ఇలా ఆస్తుల బదలాయింపు ప్రక్రియ జరుగుతోందని బాలీవుడ్ మీడియాలో చర్చ జరుగుతున్నది. ఇందులో నిజా నిజాలు ఏ మేరకు ఉన్నాయనేది చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











