Raj Kundra Gets Bail: శిల్పా శెట్టి మొదటి రియాక్షన్.. తుఫాను తరువాత జరిగేది ఇదే అంటూ పవర్ఫుల్‌గా

అశ్లీల చిత్రాలను సృష్టించాడనే ఆరోపణతో జూలై 19న రాత్రి అరెస్ట్ అయిన రాజ్ కుంద్రాకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఆ కేసులో సోమవారం ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ వార్త వెలువడిన వెంటనే, కుంద్రా భార్య, నటి శిల్పా శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మొదటిసారి ఒక అందమైన కొటేషన్ తో పరోక్షంగా స్పందించారు. గత కొంతకాలంగా ఆమె సోషల్ మీడియాలో చాలా కూల్ గా కనిపిస్తున్నారు అనిపిస్తోంది. కఠిన సమయంలోనే మన బలం ఏమిటో తెలుస్తుందని అంటూ ఇటీవల ఆమె అందమైన ఫొటోలతో గీతోపదేశం చేస్తున్నారు. ఇక సోమవారం రాజ్ కుంద్రా కు బెయిల్ మంజూరు అయినట్లు వార్తలు రాగానే మీడియాలో ఒక్కసారిగా ఆ వార్త వైరల్ అయ్యింది. ఇక అందరూ కూడా శిల్ప శెట్టి రియాక్షన్ కోసం ఎదురుచూస్తుండగా ఆమె చాలా కూల్ గా వివరణ ఇచ్చారు.

 బెయిల్ కోసం..

బెయిల్ కోసం..

గత కొంతకాలంగా రాజ్ కుంద్రా బెయిల్ కోసం పోరాడుతున్న విషయం తెలిసిందే. ఇదివరకే కొన్నిసార్లు అతని బెయిల్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అతను బయటకు వెళితే మళ్ళీ సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉన్నట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. అయితే రాజ్ కుంద్రా తరపు న్యాయవాది మాత్రం నిత్యం బెయిల్ కోసం ప్రయత్నాలు జరుపుతూనే వస్తున్నారు.

షరతులతో బెయిల్ మంజూరు

షరతులతో బెయిల్ మంజూరు

ఇక మొత్తానికి రాజ్ కుంద్రాకు సోమవారం కొన్ని షరతులతో కూడా బెయిల్ ను రూ .50,000 పూచీకత్తుతో మంజూరు చేయపడింది. రాజ్ కుంద్రా ఇదివరకే పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయగా న్యాయస్థానం రిజెక్ట్ చేసింది. ఇక బెయిల్ వచ్చిన అనంతరం సెప్టెంబర్ 21 ఉదయం 10:30 గంటలకు కుంద్రా జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే సోమవారం శిల్పా శెట్టి ఆ వార్తలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఆమె ఈ కేసు అనంతరం చాలా సైలెంట్ అయినట్లు అర్ధమయ్యింది.

శిల్పా శెట్టి రియాక్షన్..

శిల్పా శెట్టి రియాక్షన్..

ఇటీవల సూపర్ డాన్సర్ 4 షూటింగ్‌ని తిరిగి ప్రారంభించిన శిల్పా అంతకుముందు కొన్ని రోజుల పాటు ఎవరిని కలవకుండా ఉండడానికి ప్రయత్నం చేసింది. రియాలిటీ షోల నుంచి కూడా ఆమెను తప్పించినట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఆమె కొన్ని రోజులకే క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ ఎప్పటిలానే రియాలిటీ షోలతో బిజీ అయ్యారు. ఇక ఇటీవల రాజ్ కుంద్రా కేసుపై ఆమె ఎవరు ఊహించని విధంగా కామెంట్స్ చేసింది. రాజ్ కుండా చేస్తున్న వ్యాపారుల గురించి తనకేమీ తెలియదు అన్నట్లుగా వివరణ ఇచ్చింది.

Recommended Video

Prabhas Costumes To Be An Asset For Radhe Shyam | Radhe Shyam Updates
 చెడు తుఫాను తర్వాత..

చెడు తుఫాను తర్వాత..

ఇక భర్త నుంచి ఆమె దూరం కానున్నట్లు కూడా అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఇక ఇటీవల శిల్పా శెట్టి రాజ్ కుంద్రా బెయిల్ పై పరోక్షంగా స్పందించారు. "చెడు తుఫాను తర్వాత అందమైన విషయాలు జరగవచ్చని, ఆది నిరూపించడానికి ఇంద్రధనస్సు ఉనికిలో ఉంది" అని మంచి కొటేషన్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇక కుంద్రా తాజాగా బెయిల్ దరఖాస్తులో తనను 'బలిపశువు' చేస్తున్నారని వివరణ ఇచ్చినట్లు తెలు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X