For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Shilpa Shetty నా పిల్నల్ని శిక్షించొద్దు.. ఫ్యామిలిని వదిలేయండి.. శిల్పాశెట్టి భావోద్వేగంతో లేఖ

  |

  బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రాఫిక్ కంటెంట్ క్రియేషన్ వ్యవహారంలో అరెస్ట్ అయిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నది. ఈ కేసులో అనేక విషయాలను మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, బాంబే హై కోర్టు ప్రాసిక్యూషన్ పలు విషయాలను వెలికి తీస్తున్నాయి. ఇలాంటి క్రమంలో శిల్పాశెట్టి భావోద్వేగంగా స్పందిస్తూ..

  Evaru Meelo Koteeswarulu సెట్స్‌లో తారక్.. మీసం తిప్పిన స్టార్ హీరో.. గెస్ట్ చైర్‌లో ఉన్న ప్రముఖుడు ఎవరంటే!

  మీడియాలో ఊహాగానాలపై శిల్పాశెట్టి

  మీడియాలో ఊహాగానాలపై శిల్పాశెట్టి

  ఇంటర్నేషనల్ పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత శిల్పాశెట్టి, ఆమె కుటుంబంపై అనేక కథనాలు, ఊహాగానాలు, రూమర్లు, గాసిప్స్ మీడియాలో భారీగా వస్తున్నాయి. అయితే తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మీడియా కథనాలు వస్తున్నాయి. వాటిని నిలువరించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును శిల్పాశెట్టి ఆశ్రయించింది. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై పరువునష్టం దావా వేస్తాను అని శిల్పాశెట్టి హెచ్చరించారు.

  కలర్‌ఫుల్ చిలకలా ప్రియా ప్రకాశ్ వారియర్.. లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్

  పరిస్థితులన్నీ ఛాలెంజింగ్‌గా

  పరిస్థితులన్నీ ఛాలెంజింగ్‌గా

  పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రా, తన ఫ్యామిలీపై వస్తున్న కథనాలపై సోషల్ మీడియాలో ఎమోషనల్‌గా స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ.. రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత ప్రతీ విషయంలోనూ పరిస్థితులు ఛాలెంజింగ్‌గా మారాయి. మీడియా నాపై కక్ష కట్టినట్టు ప్రతికూలమైన, అనవసరమైన కథనాలు ప్రచురిస్తున్నది. అలాగే నా సన్నిహితులనే ముసుగులో ఉన్న వారు కూడా మాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు అంటూ శిల్పాశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు.

  సాయి ధన్షిక బ్యూటీఫుల్ ఫోటోలు.. సముద్ర తీరంలో అలా

  దారుణంగా ట్రోలింగ్ అంటూ

  దారుణంగా ట్రోలింగ్ అంటూ

  రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత వాస్తవాలను వెలికి తీయడానికి దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో నాపై దారుణంగా ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. నాపై పలు రకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. అలాంటి విషయాలు నా వరకే పరిమితం కాలేదు. నా కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇది చాలా బాధాకరంగా ఉంది అంటూ శిల్పాశెట్టి తాజా ప్రకటనలో పేర్కొన్నారు.

  సీరత్ కపూర్ క్లీవేజ్ షో.. అందాలు ఆరబోస్తూ హాట్ హాట్‌గా

  పోలీసులు, న్యాయవ్యవస్థపై నమ్మకం

  పోలీసులు, న్యాయవ్యవస్థపై నమ్మకం

  రాజ్ కుంద్రాకు సంబంధించిన కేసు, వ్యవహారంలో నా స్టాండ్ ఏమిటన్నది ఇంకా స్పష్టం చేయలేదు. కొన్ని విషయాలపై నాకు క్లారిటీ లేదు. కాబట్టి పలు విషయాలను ప్రస్తుతం బేరిజు వేసుకొంటున్నాను. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది కనుక నేనేమీ మాట్లాడటం లేదు. కానీ నేను మాట్లాడినట్టు కొందరు ప్రచారం చేస్తూ నేను చెప్పని విషయాలను నాకు ఆపాదిస్తున్నారు.

  అయితే కేసు విచారణ జరుగుతున్నది. ముంబై పోలీసులు, న్యాయ వ్యవస్థ మీద నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. మేము న్యాయం కోసం అవసరమైన న్యాయ కోవిదుల సలహాలు, సూచనలు తీసుకొంటున్నాం అని శిల్పాశెట్టి పేర్కొన్నారు.

  కియారా అద్వానీ గ్లామరస్ ఫోటోషూట్.. సోషల్ మీడియాలో హల్‌చల్

  నా పిలల్ని టార్గెట్ చేయొద్దు

  నా పిలల్ని టార్గెట్ చేయొద్దు

  ఇక రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత నా పిల్లలను కూడా మీడియాతోపాటు కొందరు వదిలిపెట్టడం లేదు. ఎలాంటి పాపం తెలియని నా పిల్లలను టార్గెట్ చేయవద్దని కోరుతున్నాను. ఓ తల్లిగా మీకు అభ్యర్థించేది ఏమిటంటే.. అవాస్తవ సమాచారంతో ఎలాంటి కథనాలు ప్రకటించకూడదు. దయచేసి ఏదైనా నిజముందని తేల్చుకొన్నదని తేలిన తర్వాతే వాటిని ప్రచురించండి లేదా కామెంట్ చేయండి అంటూ శిల్పాశెట్టి తన సుదీర్ఘమైన లేఖలో తెలిపారు.

  భారతీయ చట్టాలంటే గౌరవం

  భారతీయ చట్టాలంటే గౌరవం

  శిల్పాశెట్టి తన లేఖలో భావోద్వేగానికి గురి అవుతూ.. నేను 29 ఏళ్లుగా నేను ప్రొఫెషనల్‌గా ఉన్నాను. నా రంగంలో ప్రతీ రోజు కష్టపడి గుర్తింపు తెచ్చుకొన్నారు. నేను భారతీయ చట్టాలను అత్యంత గౌరవించే వ్యక్తిని నేను. నాపై విశ్వాసం పెంచుకొన్న ప్రతీ ఒక్కరి నమ్మకాన్ని వమ్ము చేయనని మాటిస్తున్నాను అని అన్నారు. దయచేసి నా ఫ్యామిలీ ప్రైవసీకి భంగం కలిగించకూడదు అని పదే పదే విన్నవించుకొంటున్నానని అన్నారు.

  Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu

  మీడియా ట్రయల్స్ అంటూ

  మా కుటుంబాన్ని టార్గెట్‌గా చేస్తూ మీడియా నిర్వహిస్తున్న ట్రయల్స్‌ను పట్టించుకోం. చట్టం తన పని తాను చేసుకుపోతున్నది. సత్యమేవజయతే. మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉండే శిల్పాశెట్టిగా పాజిటివ్ దృక్బథంతో ఈ లేఖ రాస్తున్నాను అని శిల్పాశెట్టి తెలిపారు. పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రా ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.

  English summary
  Shilpa Shetty says respect my family privacy. She wrote in her social media account that So, most importantly, I request you to respect my family’s and ‘my right’ to privacy in these times. We don’t deserve a media trial.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X