కొడుకుతో మసాజ్ చేయించుకున్న హీరోయిన్.. తెలియకుండా వీడియో తీయడంతో..!
కరోనా వైరస్ ధాటికి ప్రపంచం మొత్తం గడగడలాడిపోతోంది. కరోనాను కట్టడి చేసేందుకు భారతదేశం అనేక చర్యలను చేపడుతోంది. జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ వంటి వాటిని సమర్ధవంతంగా అమలు చేస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. సెలెబ్రిటీల నుంచి సామాన్య జనం వరకు అంతా ఇంటికి పరిమితమై ప్రధాని నిర్ణయాన్ని పాటిస్తున్నారు.

సెల్ఫ్ క్వారంటైన్‌లో సెలెబ్రిటీలు..
లాక్ డౌన్‌ను విధించక ముందే సెలెబ్రిటీలంతా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ మేరకు అంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. షూటింగ్స్ అన్నింటిని వాయిదా వేసేసి.. కరోనా గొలుసును కట్టడి చేసేందుకు ఇంటికి పరిమితమై ఉంటున్నారు. తారలంతా ఇంట్లోనే ఉంటూ తెగ సందడి చేసేస్తున్నారు. నిగూఢంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీస్తున్నారు. డ్రాయింగ్, కుకింగ్ అంటూ కొత్త కొత్తగా ట్రై చేస్తున్నారు.

శిల్పాశెట్టి హల్చల్..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యోగా, ఫిట్ నెస్ అంటూ నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఆ మధ్య చెల్లి షమితా శెట్టితో కలిసి చేసిన బుట్టబొమ్మ టిక్ టాక్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.

కొడుకుతో మసాజ్..
అయితే తాజాగా షేర్ చేసిన వీడియో మరింత వైరల్ అవుతోంది. అంతటా లాక్ డౌన్ ఉండటంతో శిల్పా శెట్టి కాస్త రిలాక్స్ అయినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం డబ్బులు లేవు.. అంతా వస్తు మార్పిడిలానే అని నువ్ నాకు మసాజ్ చెయ్.. నీకు కేక్ ఇస్తానంటూ బేరం కుదుర్చుకుంది. ఇక తన చిన్ని చిన్న చేతులతో తల్లికి మసాజ్ చేశాడు.
Recommended Video
తెలీకుండా వీడియో..
ఆ వీడియోను తన తల్లి తనకు తెలీకుండా వీడియో తీసిందని చెప్పుకొచ్చింది. ‘నా తల్లి దీన్ని షూట్ చేస్తుందని తెలియదు. అయితే అదెంత అమూల్యమైందో ఇప్పుడు నాకు అర్థం అవుతోందంటూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











