Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రెండో బిడ్డకు జన్మనిచ్చిన శిల్పాశెట్టి.. సీక్రెట్‌గా ఉంచి బోల్డ్ స్టేట్‌మెంట్
మహా శివరాత్రి పర్వదినాన బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తాను రెండోసారి తల్లి అయ్యాయని పేర్కొంది. పడంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా సందేశం పోస్ట్ చేసింది. ఫిబ్రవరి 15న ఆ బిడ్డ జన్మించినప్పటికీ, ఈ రోజు శివరాత్రి సందర్భంగా అభిమానులకి ఈ శుభవార్త చెప్పారు శిల్పాశెట్టి దంపతులు.
పొడుగుకాళ్ళ సుందరిగా భారీ పాపులారిటీ తెచ్చుకుంది హీరోయిన్ శిల్పాశెట్టి. పలు సినిమాల్లో నటించి అందరినీ మెప్పించిన ఈ భామ.. వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాని వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. వెండితెరకి దూరంగా ఉంటున్న ఆమె సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన విశేషాలను పంచుకుంటూ వస్తోంది.

ఈ నేపథ్యంలో తాను సరోగసీ విధానం ద్వారా తల్లయ్యానని పేర్కొంది శిల్ప. "ఓం శ్రీ గణేషాయ నమః.. ఇన్నాళ్ల మా పూజాలకు అద్భుత ఫలితం దక్కింది. మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. మా ఇంట్లోకి చిట్టితల్లి జూనియర్ ఎస్‌ఎస్‌కే వచ్చేసింది. ఫిబ్రవరి 15న ''సమీశా శెట్టి'' కుంద్రా ఈ లోకంలోకి అడుగు పెట్టింది. ఈ విషయం మాకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. స అంటే సంస్కృతంలో కలిగి ఉండటం అని అర్థం. మిశ అంటే రష్యన్ భాషలో దేవత. మా ఇంటి లక్ష్మి.. మా కుటుంబాన్ని పరిపూర్ణం చేసింది. మా ఏంజెల్‌కు మీ ఆశీర్వాదాలు కావాలి'' అంటూ శిల్పాశెట్టి కుంద్రా నేడు (శుక్రవారం) ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. ఇది చూసిన నెటిజన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
View this post on InstagramA post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on