twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా దారుణంగా హింసిస్తున్నావేంటి? హీరోయిన్ శిల్పా శెట్టి మీద విమర్శలు!

    By Bojja Kumar
    |

    హీరోయిన్ శిల్పా శెట్టి మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. మాల్దీవులకు హాలిడే ఎంజాయ్ చేయడానికి వెళ్లిన శిల్పా అక్కడ ఫిషింగ్ చేస్తూ ఓ వీడియో పోస్టు చేసింది. చేపను గాలం వేసి పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో కొందరు నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. మూగ జీవిని అంత దారుణంగా హింసించడానికి నీకు మనసెలా ఒప్పింది అంటూ పండి పడ్డారు. 'ఆ చేప పరిస్థితి చూస్తే బాధేస్తుంది', 'చేపకు కూడా జీవితం ఉంటుంది' అంటూ కామెంట్లతో హోరెత్తించారు. 'పెటా' సభ్యురాలివై ఉండి ఇవేం పనులంటూ కొందరు ఫైర్ అయ్యారు. దీంతో శిల్పా వివరణ ఇవ్వక తప్పలేదు.

    హింసిస్తూ ఎంజాయ్ చేయడం దారుణం

    హింసిస్తూ ఎంజాయ్ చేయడం దారుణం

    ‘ఇది నిజంగా క్రూరత్వం. అనవసరంగా ఒక చేపను దారుణంగా హింసించడం తగదు. నువ్వు దాన్ని తినాలనుకుంటే తినేయ్. అంతే కానీ ఇలా దాన్ని హింసిస్తూ ఎంజాయ్ చేయడం ఆమోద యోగ్యం కాదంటూ కొందరు కామెంట్ చేశారు.

    వివరణ ఇచ్చిన శిల్పా శెట్టి

    వివరణ ఇచ్చిన శిల్పా శెట్టి

    తనపై విమర్శలు చేస్తూ కామెంట్స్ రావడంతో శిల్పా వెట్టి వెంటనే స్పందించారు. తాను శాఖాహారిని, దాన్ని వండుకుని తినడానికి పట్టుకోలేదు. వెంటనే తిరిగి నీటిలో వదిలేశాం. అది చనిపోలేదు అని శిల్పా శెట్టి క్లారిటీ ఇచ్చారు.

    సరదా కోసం చేస్తే చివరకు ఇలా

    సరదా కోసం చేస్తే చివరకు ఇలా

    ఏదో సరదా కోసం శిల్పా శెట్టి చేసిన ఈ పని.... పలువురి ఆగ్రహానికి కారణమైంది. అందుకే సెలబ్రిటీలు ఏదైనా ఆన్ లైన్లో పోస్టు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

    పెటాకు ప్రచారం చేస్తున్న శిల్పా

    పెటాకు ప్రచారం చేస్తున్న శిల్పా

    జంతు హింస వ్యతిరేకిస్తూ శిల్పా శెట్టి 2006 నుండి ‘పెటా' తరుపున ప్రచారం చేయడంతో పాటు పూర్తి శాఖాహారిగా మారింది. అలాంటి వ్యక్తి ఇలా చేపను హింసిస్తూ కనిపించడంతో చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తూ పోస్టులు చేశారు.

    English summary
    It looks like the Internet troll machine is up and running on Shilpa Shetty's latest video clip, where she is seen fishing in Maldives and had to drop the fish back in the waters as it was non edible. Little did Shilpa Shetty know that her innocent video would end up angering her followers as they comment things like "Feeling sad for the fish" and "Fish have a life too". One user went ahead and accused her of hypocrisy as she's a part of PeTA. The user commented.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X