రేప్‌లు, లైంగిక దాడులు ట్రాష్.. అంతా ఇష్ట ప్రకారమే.. మీటూపై బాలీవుడ్ నటి సెటైర్లు

దేశవ్యాప్తంగా మీ టూ ఉద్యమం ఊపందుకొన్నది. లైంగికంగా వేధించారని, దాడి చేశారనే ఆరోపణలను మహిళా తారలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంచలన వార్తలు బయటపడుతున్నాయి. అయితే మీ టూ ఉద్యమంపై బాలీవుడ్ తార శిల్పా షిండే సెటైర్లు విసిరారు. మీ టూ ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడటం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

అంతా ఇష్ట ప్రకారమే

అంతా ఇష్ట ప్రకారమే

సినీ పరిశ్రమలో రేప్‌, లైంగిక దాడులు, లైంగిక వేధింపులు అనేవి ఉండవు. ఒకరికొకరు ఇష్టపడటం ద్వారానే లైంగిక సంబంధాలు కొనసాగుతుంటాయి. ఒకవేళ నిజంగా జరిగి ఉంటే అప్పుడే బయటపెట్టాలి. ఎప్పుడో జరిగిందని వార్తల్లోకి ఎక్కితే ఎవరూ పట్టించుకోరు అని శిల్పా షిండే అన్నారు.

సినీ ఇండస్ట్రీనే టార్గెట్

సినీ ఇండస్ట్రీనే టార్గెట్

గ్లామర్‌తో కూడిన సినీ పరిశ్రమలో మంచి లేదని, చెడు లేదు అని చెప్పడం కష్టం. కేవలం సినీ పరిశ్రమలోనే కాదు. అన్ని రంగాల్లో ఈ సమస్య ఉంది. సినిమా పరిశ్రమనే టార్గెట్ ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదు. సినిమా పరిశ్రమలో అందరూ చెడ్డవాళ్లే లేరు. మంచి వాళ్లు కూడా ఉన్నారు. వారి పేరుని ఎందుకు పాడుచేస్తున్నారో అని శిల్పా షిండే అన్నారు.

ఇక్కడ ఇచ్చి, పుచ్చుకోవడమే

ఇక్కడ ఇచ్చి, పుచ్చుకోవడమే

లైంగిక వేధింపులనేవి ఉండవు. ఒకరి కోరికకు మరొకరు ఎలా స్పందిస్తున్నారనే విషయాన్ని బట్టే ఏదైనా ఉంటుంది. ఇక్కడ అంతా ఇచ్చి పుచ్చుకోవడమే. ఏదీ బలవంతంగా జరుగదు. ఇప్పటి వరకు ఆరోపణలు వస్తున్న వివాదాల్లో పరస్పర అంగీకారంతోనే జరిగాయి.

మీడియాలోకి డర్టీ విషయాలు

మీడియాలోకి డర్టీ విషయాలు

సినీ పరిశ్రమలో చోటుచేసుకొంటున్న విషయాలు భారతీయ మహిళలకు, పురుషులకు కనువిప్పుగా మారుతున్నాయి. పలు పరిశ్రమల్లోని డర్టీ విషయాలు మీడియాల్లోకి ఎక్కుతున్నాయి. లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్ లాంటి అంశాలు ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు.

బాలీవుడ్‌ను కుదిపేస్తున్న మీ టూ

బాలీవుడ్‌ను కుదిపేస్తున్న మీ టూ

ఇటీవల కాలంలో లైంగిక వేధింపుల ఆరోపణలు బాలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి. నానా పాటేకర్‌పై తనుశ్రీ దత్తా ఆరోపణలు సెన్సేషనల్‌గా మారాయి. చేతన్ భగత్, రజత్ కపూర్, కైలాష్ ఖేర్, వికాస్ బెహల్, సాజిద్ ఖాన్ లాంటి ప్రముఖులు లైంగిక దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X