twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సుశాంత్ చనిపోతాడని ఆ నిర్మాతకు ముందే తెలిస్తే.. ఎందుకు రక్షించలేదు’

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై శివసేన అధికార పత్రిక సామ్నాలో ఆ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి సంజయ్ రౌత్ ప్రశ్నల వర్షం కురిపించారు. సువాంశ్ మరణానికి కారణం నిరాశా, నిసృృహలేనా?. ఆర్థిక సంబంధమైన డిప్రెషన్ కారణమా? అదే జరిగితే నూటికి నూరుశాతం కరెక్ట్ కాదు అంటూ ఆయన ప్రశ్నించారు. అయితే ఆయన లేవనెత్తిన ప్రశ్నలు వివాదాస్పదమయ్యేలా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కొందరు ఆయన వ్యాఖ్యలను కూడా తప్పుపడుతున్నారు. ఇక వివారాల్లోకి వెళితే..

    Recommended Video

    Sushant Singh Rajput సూసైడ్ పై Sanjay Raut ప్రశ్నలు
    మీడియాను తప్పుపట్టిన సంజయ్ రౌత్

    మీడియాను తప్పుపట్టిన సంజయ్ రౌత్

    సుశాంత్ సూసైడ్ విషయంలో మీడియా అత్యుత్సాహాన్ని శివసేన నేత సంజయ్ రౌత్ తప్పుపట్టారు. ఆయన మరణాన్ని ఓ పండుగలా చేసుకొన్నాయని విరుచుకుపడ్డారు. విషాదాన్ని పక్కన పెట్టి మీడియా తమ స్వప్రయోజనాల కోసం పాకులాడిందని ఆయన అన్నారు. అయితే సుశాంత్ మరణం తర్వాత కొందరు తమకు జరిగిన అన్యాయాలపై మౌనం వీడటం సరికాదు అని ఆయన పేర్కొన్నారు.

     ఆత్మహత్య చేసుకొంటారని నిర్మాత అనడంపై

    ఆత్మహత్య చేసుకొంటారని నిర్మాత అనడంపై

    సుశాంత్ సూసైడ్ గురించి ముందే ఊహించిన నిర్మాతపై కూడా సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఒక ఇంటర్వ్యూలో ఓ నిర్మాత మాట్లాడుతూ.. సుశాంత్ ఆత్మహత్య చేసుకొంటారని నాకు ముందే తెలుసు? అని అన్నాడు. అయితే ఓ నటుడు సూసైడ్ చేసుకొంటారని తెలిసినా.. రక్షించడానికి ఎందుకు ముందుకు రాలేదు అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. అలాగే సుశాంత్ కేసు విచారణ ఎప్పటికి తేలుతుందో ఎవరికి తెలియదు అంటూ సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు.

    పోలీసుల విచారణపై అనుమానాలు

    పోలీసుల విచారణపై అనుమానాలు

    సుశాంత్ సూసైడ్ తర్వాత చాలా మంది మీడియా ముందుకు వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటం వల్ల నిజాలు బయటకు వస్తాయా? ఈ వ్యవహారంలో పోలీసులు ఎలాంటి విచారణ చేపడుతున్నారు? ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారనే విషయాలు ఎవరికి అర్ధం కావడం లేదు అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

    డిప్రెషన్ కారణంగానే..

    డిప్రెషన్ కారణంగానే..

    గత కొద్దికాలంగా సుశాంత్ డిప్రెషన్‌లో ఉన్నారు. ఆయన మానసిక స్థితి సరిగా లేదు. ఆ కారణంగానే బాంద్రాలోని తన ఇంటిలో తనకు తాను ఉరి వేసుకొని మరణించాడు. ఈ క్రమంలోనే మాఫియా, బంధుప్రీతి ఆరోపణలు బాలీవుడ్‌లో ఊపందుకొన్నాయి. బాలీవుడ్‌లో ఇలాంటి మానసిక పోరాటాలు ప్రతీ రోజు ఉంటాయి. కొందరు కెరీర్ నాశనం చేశారనే కారణంతో ఆత్మహత్య చేసుకొన్నారనే ఆరోపణలు సరికాదు. అలా అంటే ప్రతీ రోజు కనీసం ఇద్దరు ఆత్మహత్యలు జరగడానికి అవకాశం ఉంటుంది అని సంజయ్ రౌత్ తన వ్యాసంలో పేర్కొన్నారు.

     సంజయ్ రౌత్ కథనంపై అభ్యంతరాలు

    సంజయ్ రౌత్ కథనంపై అభ్యంతరాలు

    అయితే సంజయ్ రౌత్ వేసిన ప్రశ్నలు, వ్యక్తం చేసిన ఆరోపణలపై కొందరు ఘాటుగా స్పందిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యను, పోలీసుల విచారణను కించపరిచే విధంగా ఆయన మాట్లాడారని పలువురు విమర్శిస్తున్నారు. జూన్ 14వ తేదీన ముంబైలోని బాంద్రాలో సుశాంత్ ఆత్మహత్య చేసుకొన్న తర్వాత ఆయన మృతిపై అనేక రకాలు కథనాలు, ఆరోపణలు ఊపందుకొన్నాయి. ఈ క్రమంలో సంజయ్ రౌత్ సామ్నాలో రాసిన వ్యాసం ఇప్పుడు మీడియాలోను, సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.

    English summary
    Shiva Sena leader, Former central minister Sanjay Raut raises questions on Sushant Singh Rajput suicide. He said, Sushant Singh's death happen becuase only depression of actor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X