twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారీ అగ్ని ప్రమాదం.. కరణ్ జోహర్‌కు తీరని నష్టం.. కాలి బూడిదైన ధర్మ ప్రొడక్షన్స్

    |

    ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌ సొంత నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఏప్రిల్ 30న జరిగిన ఈ ప్రమాదంలో విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్టు సమాచారం. ధర్మ ప్రొడక్షన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంతో కరణ్ జోహర్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు సమాచారం. ఎంత మేరకు ఆస్థినష్టం జరిగిందనే విషయంపై యూనిట్ అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రధాన సినీ నిర్మాణ సంస్థల్లో అగ్ని ప్రమాదం జరగడం ఇది రెండోసారి. దాంతో సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

     కాలిబూడిదైన ధర్మ ప్రొడక్షన్ గోడౌన్

    కాలిబూడిదైన ధర్మ ప్రొడక్షన్ గోడౌన్

    ధర్మ ప్రొడక్షన్‌ను కరణ్ జోహర్ తండ్రి యష్ జోహర్ 1976లో తూర్పు గోరేగావ్‌లోని కామా ఇండస్ట్రీల్ ఎస్టేట్‌లో ప్రారంభించారు. దీని విస్తీర్ణం 18 వేల చదరపు అడుగులు. ఈ స్టూడియోలో విలువైన వస్తువులు, పుస్తకాలు, సినిమా స్క్రిప్టులు, షూటింగ్ పరికరాలు ఉన్నాయి. అత్యంత విలువైన పరికరాలు ఉన్న ఈ గోడౌన్‌లోని మొదటి ఫ్లోర్‌లో మంటలు భారీగా వ్యాపించడంతో బూడిదే మిగిలిందని ప్రాథమిక సమాచారం.

    విలువైన వస్తువుల దహనం

    విలువైన వస్తువుల దహనం

    బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం.. కొన్నేళ్లుగా ధర్మ ప్రొడక్షన్ సమకూర్చుకొన్న విలువైన సంపద కాలి బూడిదైంది. భారీ మొత్తంలో క్యాస్టూమ్స్, పరికరాలు మంటలకు ఆహుతి అయ్యాయి. తండ్రికి సంబంధించిన వస్తువులు, వెలకట్టలేని వస్తువులు కాలిపోయాయి. 80వ దశకం నుంచి రూపొందించిన సినిమా మెమొరీస్ ఆనవాళ్లు లేకుండా పోయాయి అని వెల్లడించాయి.

    లేటేస్ట్ సినిమాలవి కూడా

    లేటేస్ట్ సినిమాలవి కూడా

    తాజా ప్రమాదంలో మరో విషాదమేమిటంటే.. సెట్స్‌పై ఉన్న సినిమాలు, తదుపరి చిత్రాలకు సంబంధించిన ప్రాపర్టీలు, స్క్రిప్టులు, విలువైన వస్తువులు కూడా మంటల్లో తగలబడిపోయాయట. ఈ ప్రమాదం వల్ల భారీగా నష్టం వాటిల్లిందని చెప్పుకంటున్నారు. డబ్బుపరంగానే కాకుండా వెలకట్టలేని వస్తువులు అగ్నికి ఆహుతి కావడం తీరని నష్టంగా భావిస్తున్నారు. కోట్లలోనే ఆస్తి నష్టం జరిగిందనే మాట వినిపిస్తున్నది.

    ఉదయమే ఆ రెండు ప్రమాదాలు

    ఉదయమే ఆ రెండు ప్రమాదాలు

    ఇలాంటి భారీ ప్రమాదమే ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కే స్టూడియోస్‌లో చోటుచేసుకొన్నది. ధర్మ ప్రొడక్షన్‌లో జరిగిన ప్రకారమే ఉదయం 2 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకోవడం అనేక అనుమానాలకు దారి తీస్తున్నది. లెజెండరీ యాక్టర్ రాజ్ కపూర్ ఆర్కే స్టూడియోను ముంబైలోని చెంబూర్‌లో నిర్మించిన సంగతి తెలిసిందే.

    English summary
    Fire breaks out at Karan Johar's Dharma Productions' godown, film props, books and costumes turned to ashes. The filmmaker reportedly lost a treasure trove of props, books and other valuables in the fire that engulfed his godown in the wee hours yesterday
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X