Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సల్మాన్ ఖాన్‌కు భారీ షాక్: ‘రాధే’ను బాయ్‌కాట్ చేయాలంటూ డిమాండ్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా తెరకెక్కిస్తోన్న చిత్రం 'రాధే: ద మోస్ట్ వాంటెడ్ భాయ్'. 'వాంటెడ్', 'దబాంగ్ 3' వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఈ మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో స్టార్ హీరో సల్లూ భాయ్‌కు నెటిజన్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. దీనికి కారణం సోషల్ మీడియాలో ఈ మూవీకి వ్యతిరేకంగా ఓ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుండడమే.
'రాధే' మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారమే విడుదల చేశారు. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫలితంగా ఇది భారీ స్థాయిలో వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్విట్టర్లో 'Boycott Radhe' అనే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే దీనిపై దాదాపు 20 వేలకు పైగా ట్వీట్లు వచ్చాయి. దీంతో ఈ సినిమా దేశ వ్యాప్తంగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ వ్యవహారంతో హీరో సల్మాన్ ఖాన్‌కు భారీ షాక్ తగిలినట్లైంది.
డ్రగ్స్ మాఫియాపై పోరాటం చేసే ఓ పోలీస్ అధికారి కథతో రూపొందిన 'రాధే'ను సల్మాన్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి, సోహైల్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు. 2017లో వచ్చిన కొరియన్ సినిమా 'ద ఔట్ లాస్' అనే సినిమాకు ఇది రీమేక్‌గా వస్తోంది. ఇందులో మేఘా ఆకాశ్, దిశాపటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రణ్ దీప్ హుడా, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేస్తున్నారు. అదే రోజు ఓటీటీలోనూ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.