Kiara Advani పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా.. మూడు సినిమాల రెమ్యునరేషన్ మొత్తం పెళ్లికే..

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో ఇప్పుడు మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్టులో కీయరా అద్వానీ సిద్ధార్థ్ మల్హోత్రా కూడా చేరిపోయారు. ఇటీవల గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రతిరోజు వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి ఎంత ఖర్చు చేసి ఉంటారు అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం కోట్ల రూపాయల్లోనే వీరి పెళ్లికి ఖర్చు చేయడం జరిగిందట. దాదాపు వారి మూడు సినిమాల రెమ్యునరేషన్ మొత్తం కూడా ఈ పెళ్లి కోసమే ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

పుకార్లపై స్పందించకుండా..

పుకార్లపై స్పందించకుండా..

బ్యూటిఫుల్ గ్లామరస్ హీరోయిన్ కీయరా అద్వాని బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇక గత మూడేళ్లుగా ఈ బ్యూటీ ప్రేమలో ఉన్నట్లుగా అనేక రకాలు కథనాలు వచ్చినప్పటికీ ఇలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. హీరో సిద్ధార్థ మల్హోత్రా కూడా ప్రేమ పుకార్లపై ఎప్పుడూ కూడా స్పందించకుండా తప్పించుకుంటూ తిరిగాడు.

ప్రేమ లేదేమో అని..

ప్రేమ లేదేమో అని..


ఒకానొక సమయంలో రూమర్స్ పై సిద్దార్థ్ సీరియస్ కూడా అయ్యాడు. అయితే నిజంగానే వీరి మధ్యలో ఎలాంటి ప్రేమ లేదేమో అని మరికొందరు అనుకున్నారు. కానీ ఊహించని విధంగా వీరు పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలియడంతో అందరూ కూడా ఆశ్చర్యపోయారు. పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా ఈ ఇద్దరు అఫీషియల్ గా ప్రకటించలేదు. పెళ్లి పూర్తయిన తర్వాతనే వారి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

 రాజీ పడకుండా..

రాజీ పడకుండా..

ఇక 2023 ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్లోని ప్రముఖ ప్యాలెస్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే అక్కడికి మీడియాను కూడా వారు ఆహ్వానించలేదు. కేవలం అతికొద్దిమంది కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులు మాత్రమే ఆ వేడుకలో పాల్గొన్నారు. అయితే ఈ వేడుక కోసం కీయరా అద్వాని సిద్దార్థ్ మల్హోత్రా ఇద్దరు కూడా ఏమాత్రం రాజీ పడకుండా ఖర్చు చేసినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి.

 ప్యాలెస్ కోసం

ప్యాలెస్ కోసం


రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఇద్దరి వివాహ వేడుక జరిగింది. అయితే ఈ ప్యాలెస్ ను మూడు రోజులపాటు బుక్ చేసుకుని అక్కడే పెళ్లి కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు. ఇక కేవలం ఆ ప్యాలెస్ రెంట్ కోసమే దాదాపు నాలుగు కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.

కానుకల కోసం కోటి

కానుకల కోసం కోటి


ఇక మూడు రోజులపాటు అతిధులు ఉండేందుకు ప్యాలెస్ లోనే ప్రత్యేకంగా గదులను సిద్ధం చేశారు. ఇక వారికి సంబంధించిన కానుకల కోసం కూడా ఈ బాలీవుడ్ జంట దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు. వారికి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం కోసం కూడా భారీగానే ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.

 సెక్యూరిటీ, ఫుడ్ కోసం..

సెక్యూరిటీ, ఫుడ్ కోసం..

ఇక భారీ స్థాయిలో సెలబ్రిటీలు వస్తారు కాబట్టి అందులో సెక్యూరిటీ కోసం కూడా గట్టిగానే ఖర్చు చేసినట్లు సమాచారం. ఇక మూడు రోజులు వందల రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా అక్కడే సిద్ధం చేయడం కోసం కూడా ఎక్కువ స్థాయిలో ఖర్చు చేసినట్లు సమాచారం. ఇక పెళ్లి మొదటి అడుగు నుంచి చివరి వరకు పెళ్లి హంగులు ఆర్భాటాల కోసం వెడ్డింగ్ డెకరేషన్ కోసం ఇలా వివిధ రకాలుగా మరో 15 కోట్లు ఖర్చయింది.

మూడు సినిమాల రెమ్యునరేషన్ పెళ్లి కోసమే..

మూడు సినిమాల రెమ్యునరేషన్ పెళ్లి కోసమే..

మొత్తంగా అయితే కీయరా అద్వాని సిద్ధార్థ మల్హోత్రా ఇద్దరు కూడా వారి పెళ్లి కోసం 20 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ఒక విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఇది అత్యధిక బడ్జెట్ తో జరిగిన వెడ్డింగ్ అని చెప్పవచ్చు. ఇక దాదాపు ఈ స్టార్స్ వారి మూడు సినిమాల కు సంబంధించిన రెమ్యునరేషన్ పెళ్లి కోసమే ఖర్చు చేశారన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X