War 2: ఎన్టీఆర్ పాత్ర అలా ఉండనుందా.. అభిమానుల్లో టెన్షన్.. రెమ్యునరేషన్ ఎంతంటే?
టాలీవుడ్ లోనే కాదు దాదాపుగా ఇండియన్ సినీ పరిశ్రమలో ఇప్పుడు మనం ఆసక్తికరమైన మల్టీస్టారర్ ప్రాజెక్టులు సెట్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ కండల వీరుడిగా పేరు తెచ్చుకున్న హృతిక్ రోషన్ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి వార్ 2 సినిమా కోసం పని చేయబోతున్నారు అంటూ ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఇక ఆ సినిమాలో తారక్ పాత్ర ఎలా ఉంటుంది అలాగే రెమ్యునరేషన్ ఎంత అనే విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
రాబోయే సిమిమాలు: RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ కు భారీ స్థాయిలో క్రేజ్ అందుతోంది. రాబోయే సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటాయని కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ బిగ్గెస్ట్ బాలీవుడ్ యాక్షన్ మూవీలో భాగం కాబోతున్నట్లు మరో గాసిప్ వైరల్ అవుతోంది. అది కూడా మల్టీస్టారర్ యాక్షన్ మూవీ వార్ 2 అంటున్నారు.

ఫస్ట్ టైమ్ బాలీవుడ్ మూవీ: మొదటి సారిగా బాలీవుడ్ సినిమాలో చేయబోతున్నాడని ఇక ఈ సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాతో డైరెక్టర్ గా ముద్ర వేసుకున్న అయాన్ ముఖర్జీ యశ్ రాజ్ ఫిలిమ్స్ తో కలిసి స్పై యూనివర్స్ సినిమాకి డైరెక్షన్ చేయబోతున్నాడు అంటూ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
ఫిక్స్ అయినట్లే: వాస్తవానికి హృతిక్ రోషన్ నుంచి కానీ ఎన్టీఆర్ నుంచి కానీ యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి కానీ అయాన్ ముఖర్జీ నుంచి కానీ ఈ సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.కానీ తరణ్ ఆదర్శ్ ప్రకటించారంటే దాదాపుగా అది కన్ఫామ్ అయిపోయినట్లే. ఇక అందులో ఉంటే హీరోలు ఎవరెవరు అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి.

రెమ్యునరేషన్ ఎంత?: ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ తీసుకునే రెమ్యూనరేషన్ గురించి ఒక ఆసక్తికరమైన ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో నటించేందుకు జూనియర్ ఎన్టీఆర్ దాదాపు 75 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకు ఎన్టీఆర్ కెరియర్ లో తీసుకోబోతున్న అత్యధిక రెమ్యూనరేషన్ ఇదే అనే ప్రచారం జరుగుతోంది.
విలన్ గా చేయనున్నాడా?: అయితే ఇక ఈ సినిమా కోసం హృతిక్ రోషన్ 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కి విలన్ గా కనిపిస్తారా? లేక ఆయనతో కలిసి పని చేసే మరో రక్షణశాఖ అధికారిగా పనిచేస్తారా? అనే విషయం మీద క్లారిటీ లేదు.

ఫ్యాన్స్ టెన్షన్?: ఇప్పటికే ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి కనిపించినప్పుడు ఆయనకు స్క్రీన్ స్పేస్ తక్కువగా లభించిందని వార్తలు వచ్చాయి. ఇక రామ్ చరణ్ క్యారెక్టర్ డామినేట్ చేసేలా డిజైన్ చేశారని ఇలా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రకరకాల కామెంట్లు చేశారు. ఇప్పుడు హృతిక్ రోషన్ తో సినిమా అంటే ఈ స్క్రీన్ స్పేస్, క్యారెక్టర్ డిజైన్ ఎలా ఉండబోతుంది అనే విషయం మీద కూడా చర్చ జరుగుతుంది. చూడాలి ఇక ఈ సినిమా నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











