బతికి ఉండగానే.. నటుడు మన్మీత్ సూసైడ్ వెనుక భయంకర విషయాలు!
భారతీయ సినీ, టెలివిజన్ పరిశ్రమను లాక్‌డౌన్ మరణాలు ఆందోళనను కలిగిస్తున్నాయి. రెండు నెలలుగా సినిమా షూటింగులు, ఇతర కార్యక్రమాలు నిలిచిపోవడంతో కళాకారులు, నటీనటుల జీవితాలు ముందుకెళ్లడం కష్టంగా మారాయి. గత రెండు నెలలుగా ఆదాయం లేకపోవడం వల్ల అప్పుల పాలైన టీవీ నటుడు మన్మీత్ గ్రేవాల్ ముంబైలో ఆత్మహత్యకు పాప్పలడం అందర్నీ షాక్ గురిచేసింది. మన్మీత్ మరణం వెనుక భయంకరమైన వాస్తవాలు బయటకు వస్తున్నాయి. అవేమిటంటే..

రెండేళ్ల క్రితమే పెళ్లి
మన్మీత్ సింగ్ తన మరణానికి ముందు తనతో మాట్లాడారని తన స్నేహితుతుడు మంజిత్ మీడియాకు తెలిపారు. మన్మీత్ సింగ్ పెళ్లి జరిగి రెండేళ్లు అవుతున్నది. ఆయన పెళ్లికి కూడా వెళ్లాం. నాకు మన్మీత్ సోదరుడి లాంటి వాడు. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. మరణానికి ముందు రోజు సాయంత్రం 5 గంటల సమయంలో మాట్లాడాను. అంతా బాగానే ఉన్నట్టు కనిపించాడు అని మంజిత్ వెల్లడించారు.

లాక్‌డౌన్ ముందు వరకు సవ్యంగానే
లాక్‌డౌన్ ముందుకు వరకు మన్మీత్ జీవితం చాలా సవ్యంగా సాగింది. లోన్ తీసుకొని విదేశీ యాత్రకు వెళ్లి వచ్చారు. లోన్ క్రమంగా చెల్లిస్తూ వస్తున్నాడు. కానీ లాక్ డౌన్ తర్వాత పరిస్థితులు దిగజారాయి. తాను అప్పుల్లో ఉన్నాడనే విషయం తెలుసు. కానీ ప్రాణం తీసుకొనేంతగా కాదు. ముందు రోజు మాట్లాడినప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. కానీ అంతలోనే దారుణమైన వార్తను వినాల్సి వచ్చిందని అనుకోలేదు అని మంజిత్ సింగ్ తెలిపారు.

మన్మీత్ మరణానికి ముందు స్నేహితుడు సూసైడ్
మన్మీత్ సింగ్ మరణించడానికి ముందు ఆయనను ఓ విషాదం వెంటాడింది. ఆయన స్నేహితుడు కూడా నాలుగు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకొని మరణించాడు. తన స్నేహితుడు కూడా ఆర్థికమైన సమస్యలతో బాధపడుతున్నాడు. స్నేహితుడి మరణం కుంగదీసి ఉంటుదేమో. ఆ మరణం ప్రభావం మన్మీత్ సింగ్ మీద పడి ఉంటుందేమో అనే అనుమానం కలుగుతుందని మంజిత్ వెల్లడించారు.

మన్మిత్ మరణవార్త ఆలస్యంగా
లాక్‌డౌన్ కారణంగా నాకు మన్మిత్ సింగ్ మరణవార్త చాలా ఆలస్యంగా తెలిసింది. ఆయనతో నాకు, నా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. మా కోసం గురుద్వారా కా హల్వా తెచ్చిస్తానని ఇచ్చిన మాటను నిలిబెట్టుకోలేకపోయాడు. నా కెరీర్ గురించి మన్మీత్ చాలా కేర్ తీసుకొనేవాడు. నాకు చాలా సలహాలు ఇస్తూ ఉండేవాడు. మన్మిత్ లేని విషయాన్ని ఊహించుకోలేకపోతున్నాను అని మంజిత్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Recommended Video

జీవంతో వేలాడుతుండగా..
మన్మిత్ సింగ్ మరణానికి సంబంధించి నాకు భయంకర విషయం తెలిసింది. మన్మీత్ సీలింగ్ ఫ్యాన్‌కు జీవంతో వేలాడుతుండగా ఎవరూ కూడా తాడును విప్పలేదని, కొందరు మాత్రం మొబైల్ ఫోన్‌లో ఫోటీలు తీసుకొంటున్నారనే విషయం తెలిసింది. భార్య రక్షించండి అంటూ కేకలు వేసినప్పుడు ఎవరైనా ముందుకొచ్చి ఉరివేసుకొన్న చున్నీని తెంపినట్లయితే మన్మీత్ బతికివాడు అని మంజిత్ ఆవేదన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications