Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆ హాట్ బ్యూటీ బయటకు వెళితే లక్షల్లో ఖర్చు.. కుర్ర హీరో దగ్గర గట్టిగానే లాగుతోందట!
బాయ్ ఫ్రెండ్ అనే పదానికి సోషల్ మీడియాలో ఎలాంటి విలువ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గ్యాప్ లేకుండా మీమ్స్ పుడుతూనే ఉంటాయి. ఇక బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత కొన్నాళ్లుగా ఒక జంటపై కూడా ట్రోల్స్ కూడా చాలానే వస్తున్నాయి. వారెవరో కాదు.. మలైకా అరోరా - అర్జున్ కపూర్. ఈ జోడిపై వారానికో వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది.
'ఆ టైమ్లో నీ హాట్ ఫొటోలు తీస్తా' అని గొడవ చేస్తున్నాడు: మలైకా అరోరా ఫిర్యాదు
హాట్ బ్యూటీ..
మలైకా అరోరా చాలా ఏళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. వయసు ఎంత పెరిగినా కూడా ఇంకా తన అందంతో కుర్రాళ్లను ఆకట్టుకుంటూనే ఉంటోంది. ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫొటోస్ తో నిత్యం వైరల్ అయ్యేలా ప్రవర్తిస్తుంది. కెవ్వుకేక సాంగ్ తో టాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై కూడా హాట్ స్టెప్పులతో ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలు తగ్గించేసి తనకు నచ్చినట్లుగా జీవిస్తోంది.
కుర్ర హీరోతో ప్రేమాయణం
మలైకా అరోరా గురించి అందరికి తెలిసే ఉంటుంది. వయసు 46. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భజ్ ఖాన్ ను మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత విడాకులు తీసుకుంది. తనకు నచ్చినట్లుగా జీవితాన్ని కొనసాగిస్తూ ప్రస్తుతం తన కంటే 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. గత కొన్నేళ్లుగా అతనితో ఎఫైర్ ని కొనసాగిస్తున్న ఈ బ్యూటీ ఇప్పటివరకు తన ఆలోచనలపై ఎక్కడా కూడా క్లారిటీ ఇవ్వలేదు.
బయటకు వెళితే లక్షల్లో ఖర్చు..
మలైకా అరోరా ఎక్కడికెళ్లినా చాలా కాస్ట్లీ లైఫ్ ని మెయింటైన్ చేస్తుంది. ఆమె బయటకు వెళితే దాదాపు 3లక్షలు వరకు ఖర్చులు ఉంటాయట. ఎక్కువగా ఈ బ్యూటీకి హ్యాండ్ బ్యాగ్స్ ఇష్టం. విదేశాలకు వెళ్లినప్పుడు కనీసం నాలుగైదు హ్యాండ్ బ్యాగ్స్ తీసుకురాకపోతే మలైకా హ్యాపీగా ఉండలేదట. వాటి విలువ ఒక్కోటి రూ.2లక్షలకు తక్కువ ఉండదట. ఇక కుదిరిన ప్రతిసారి ఇష్టం వచ్చిన దేశానికి వెళుతూ హాలిడేస్ ని ఎంజాయ్ చేయడంలో కూడా మలైకా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది.
ప్రియుడి నుంచి ఖరీదైన బహుమతులు..
మలైకా అరోరా బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ కూడా తన ప్రియురాలి కోసం ఖరీదైన బహుమతులు కొనడంలో ముందుంటాడట. ఆమెకు బ్రాండెడ్ దుస్తులు, అలాగే ఖరీదైన నగలు కొనడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాడట. ఇద్దరు కలిసి షాపింగ్ చేస్తే ఖర్చులు అకాశాన్ని తాకేస్తాయని, సంపాదించిన దాంట్లో సగం ఎంజాయ్ చేయడానికే ఉపయోగిస్తారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.