రెమ్యునరేషన్‌తో షాక్ ఇస్తున్న సోనూ సూద్.. ఆ రేటుకు భయపడిన బోయపాటి

లాక్ డౌన్ సమయంలో చాలా వరకు జనాల కష్టాలను తీర్చిన బాలీవుడ్ సీనియర్ నటుడు సోనూ సూద్ ఆ తరువాత విలన్ పాత్రలు చేస్తాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు గాని అందులో ఆయన పాత్రలు నెగటివ్ గా ఉంటే ఓ వర్గం జనాలు మాత్రం అందుకు ఒప్పుకునేలా లేరని అనిపిస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఇప్పటికి కూడా సోనూ సూద్ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

 రియల్ హీరో అని ఫిక్స్ అయ్యారు

రియల్ హీరో అని ఫిక్స్ అయ్యారు

కరోనా వైరస్ కారణంగా సొంత ఇళ్లకు చేరుకోవాలని వేల కిలో మీటర్లు నడవడానికి సిద్దమైన జనాలకు సోనూ సూద్ ఒక ఆపద్బాంధవుడిలా వచ్చి ఎన్నో బస్సులను వాళ్ళ కోసం ఏర్పాటు చేశారు. అయితే సోనూ సూద్ అలా చేశాడో లేదో జనాలు ఒక్కసారిగా అతన్ని రియల్ హీరోగా చూశారు. ఇక అతనే మాక్ హీరో అంటూ రాజకీయల్లోకి కూడా రావాలని అంటున్నారు.

రెమ్యునరేషన్ డోస్ పెంచిన సోనూ

రెమ్యునరేషన్ డోస్ పెంచిన సోనూ

అసలు విషయంలోకి వస్తే సోనూ సూద్ కి హీరోగా కూడా ఆఫర్స్ చాలానే వస్తున్నాయి. ఇక విలన్ సపోర్టింగ్ రోల్స్ కూడా గ్యాప్ లేకుండా వస్తున్నాయట. అయితే రెమ్యునరేషన్ విషయంలో సోనూ సూద్ రెండు మెట్లు పైకి ఎక్కినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ కంటే ముందు ఈ సీనియర్ నటుడు సినిమాకు కోటి నుంచి రెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకునేవారు. అయితే ఇప్పుడు ఆ లెక్క నాలుగు కోట్లకు పేరిగినట్లు సమాచారం.

భయపడిన బోయపాటి

భయపడిన బోయపాటి

రాబిన్ హుడ్ రేంజ్ లో జనాలకు ఇంకా సహాయం చేయాలని అనుకుంటున్నాడో ఏమో గాని ఎలాంటి ఆఫర్స్ వచ్చిన కూడా అదే రేటు చెబుతున్నారట. ఇక బోయపాటి శ్రీనివాస్ కూడా బాలయ్య సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం సోనూ సూద్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ కూడా 4కోట్లు చెప్పడంతో బోయపాటి భయపడి వెనుకడుగు వేసినట్లు టాక్ వస్తోంది.

Recommended Video

Green India Challenge : Director Srinu Vaitla Takes Up Green India-Challenge & Nominated Sonu Sood
ముందు ఆ నటుడి కోసం ప్రయత్నించి..

ముందు ఆ నటుడి కోసం ప్రయత్నించి..

అసలే సినిమా బడ్జెట్ పెరిగిందని తన రెమ్యునరేషన్ ని తగ్గించుకున్న బోయపాటి, సోనూ సూద్ మాటలకు షాక్ అయ్యి వెనక్కి వచ్చేశాడట. అసలైతే ఈ దర్శకుడు మొదట సంజయ్ దత్ ని అనుకున్నప్పటికి ఆ తరువాత సోనూ సూద్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. ఇక మొత్తానికి క్యాన్సిల్ అవ్వడంతో మరో నటుడి కోసం వెతికే పనిలో పడ్డారట. అందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X