అర్ధనగ్నంగా అమ్మాయిలతో హీరో అక్షయ్ కుమార్ చిందులు.. దారుణంగా ట్రోలింగ్!
సినిమా ప్రపంచంలో కొంత మంది సినీ తారలు అప్పుడప్పుడు మితిమీరి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో అలాంటి వారికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఏ మాత్రం లీకైన కూడా నేటిజన్స్ ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలు తరచుగా ఇలాంటి కాంట్రవర్సీలలో నిలుస్తూ ఉంటారు. అయితే ఈసారి అక్షయ్ కుమార్ కూడా అదే తరహాలో నెగిటివ్ ట్రోల్స్ ఎదుర్కోవడం సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారుతుంది. అర్థనగ్నంగా అక్షయ్ కుమార్ ఒక కార్యక్రమంలో చేసిన స్టెప్పులు ఊహించిన విధంగా నెగిటివ్ కామెంట్స్ ని అందిస్తున్నాయి.
బాలీవుడ్ సినిమా ప్రపంచంలో కొన్నిసార్లు డబ్బున్న వాళ్ళ ఈవెంట్స్ లో బాలీవుడ్ స్టార్స్ డాన్స్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం హిందీలో ఉన్న టాప్ సెలబ్రిటీలు కూడా అలాంటి ఈవెంట్స్ లో పాల్గొంటూ చాలా డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. వందల కోట్లు ఉన్నా కూడా వారు ఆ తరహాలో చిన్న చిన్న ఎమౌంట్స్ కు ఆశపడడం ఏమిటి అనే విధంగా కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయి. అయితే రీసెంట్ గా అక్షయ్ కుమార్ ఒక ఈవెంట్లో పాల్గొన్న విధానం అతనిపై ఊహించిన విధంగా ట్రోల్స్ కు అయితే దారితీస్తోంది.

అక్షయ్ కుమార్ ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు అయితే. ఆ ఈవెంట్లో వేదికపై అతను ఊహించిన విధంగా డాన్స్ చేశాడు. అతనితోపాటు మౌని రాయ్ అలాగే మరి కొంతమంది చిన్న స్థాయి నటీమణులు కూడా ఉన్నారు. ఇక వారందరూ కూడా స్టేజ్ పై డ్యాన్స్ చేస్తూ ఉండగా మధ్యలో వచ్చిన అక్షయ్ కుమార్ అర్ధ నగ్నంగా షర్ట్ లేకుండా వచ్చి చిందులు వేశాడు.
ఇక వారు వేస్తున్న స్టెప్పులు చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు దారుణంగా ట్రోల్ అయితే చేస్తున్నారు. 59 ఏళ్ల వయసులో నీకంటే చాలా చిన్న వయసు ఉన్న అమ్మాయిలతో అలాంటి స్టెప్పులు ఏంటి? అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ హీరోలకు అసలు ఏ మాత్రం సంస్కారం ఉండదు అని డబ్బుల కోసం ఇష్టం వచ్చినట్లుగా డ్యాన్స్ చేస్తారు అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్షయ్ కుమార్ వయసుపై నుంచే ఊహించిన విధంగా కామెంట్స్ అయితే వస్తున్నాయి. దాదాపు 23 నుంచి 24 ఏళ్ల వయసున్న అమ్మాయిలతో అక్షయ్ కుమార్ డాన్స్ చేసే విధానం ఏ మాత్రం కరెక్ట్ గా లేదని.. ఇలాంటి అనవసరపు వేషాలు వేసి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని మరికొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











