Kareena Kapoor: ఆ ఒక్క టీ షర్ట్ 40 వేలు.. ఏడ్చినట్లే ఉంది.. దారుణమైన ట్రోలింగ్!

సినిమా ప్రపంచంలో స్టార్ సెలబ్రెటీలు బయటకు వెళితే అందరిలో కూడా వారే హైలెట్ అవ్వాలని అనుకుంటారు. ముఖ్యంగా కెమెరాలను కూడా వారి పైనే ఫోకస్ చేసే విధంగా డ్రెస్సింగ్ స్టైల్ తోనే ఆకట్టుకుంటారు. ఇక హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే కొన్ని సార్లు వాళ్ళు ఖరీదైన డ్రెస్ వేసుకున్న అవి నవ్వులపాలయ్యేలా చేస్తాయి. చూడటానికి అంత బాగా అనిపించవు. ఇక సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ అయిన తర్వాత అలా విభిన్నమైన డ్రెస్సింగ్ స్టైల్ తో కనిపించే వారి పై దారుణమైన ట్రోల్ అయితే జరుగుతుంది. ఇక రీసెంట్ గా మరో సారి కరీనా కపూర్ అదే తరహాలో ట్రోలింగ్ బారిన పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

బెస్ట్ హీరోయిన్స్ లో ఒకరిగా..

బెస్ట్ హీరోయిన్స్ లో ఒకరిగా..

కపుర్ ఫ్యామిలీకి చెందిన కరీనాకపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో దశాబ్ద కాలానికి పైగా అగ్రహీరోయిన్ గా కొనసాగిన వారిలో ఒకరు. కరీనా కపూర్ బాలీవుడ్ ఆల్ టైమ్ బెస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్స్ లిస్ట్ లో కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పాలి. ఈ బ్యూటీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత ఏమాత్రం వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు సాగింది. పోటీగా ఎంతమంది బ్యూటిఫుల్ హీరోయిన్స్ వచ్చినా కూడా ఆమె రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు.

కెరీర్ స్టార్ట్ అయిన తరువాత

కెరీర్ స్టార్ట్ అయిన తరువాత

దాదాపు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలందరితో కరీనాకపూర్ స్క్రీన్ షేర్ చేసుకుంది. కేవలం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా విభిన్న మైన ప్రయోగాత్మకమైన ఎన్నో సినిమాల్లో నటించింది. ఇక కరీనా కపూర్ సినిమా కెరీర్ ని మొదలు పెట్టిన తర్వాత ఎప్పుడూ కూడా పెద్దగా గ్యాప్ తీసుకున్నది లేదు. పెళ్లికి ముందు వరకు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసింది.

సైఫ్ తో పెళ్లి

సైఫ్ తో పెళ్లి

ఇక ఆమె ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత కరీనా కపూర్ తో ప్రేమయనాన్ని మొదలుపెట్టాడు. వీరిద్దరి వయసులో 10 ఏళ్ళ వ్యతసం ఉంది. వీరు ఇద్దరూ కూడా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.

40 ఏళ్ళ వయసులో..

40 ఏళ్ళ వయసులో..

ఇక పెళ్లయి 4 నాలుగు పదుల వయసు లోకి వచ్చిన తర్వాత కూడా కరీనా కపూర్ గ్లామర్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని చెప్పాలి. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా ఆమె హీరోయిన్గా కొనసాగుతొంది అంటే అంత సాధారణమైన విషయం కాదు. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాలో కూడా ఆమె మేయిన్ హీరోయిన్ గా నటించింది.

40 వేల టీ షర్ట్

40 వేల టీ షర్ట్

ఇక అప్పుడప్పుడు కరీనాకపూర్ వేసుకునే డ్రెస్సులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురి అవుతూ ఉంటాయి. ఇటీవల ఆమె ఎంతో ఖరీదైన గుస్సి ఎల్లో టీషర్ట్ ను వేసుకుంది. దాని విలువ దాదాపు 40,000 ఉంటుందట. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

దారుణమైన ట్రోలింగ్

దారుణమైన ట్రోలింగ్

అయితే ఆమె వేసుకున్న డ్రెస్ 40 వేలు అయినప్పటికీ ఏ మాత్రం బాగో లేదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కరీనాకపూర్ వేసుకున్న డ్రెస్ టీ షర్ట్ పై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు అది ఏమాత్రం బాగోలేదు అని దాదాపు అదే తరహాలో ఉండే టీ షర్ట్ మేము కేవలం 150 రూపాయలకు కొనుగోలు చేస్తామని అంటున్నారు. స్టార్ హోదా వచ్చిన తరువాత అసలు ఎలాంటి బట్టలు కొనాలి ఎంత ఖరీదుతో కొనాలి అనే విషయం కొంతమంది సెలబ్రిటీలకు ఏమాత్రం తెలియదని కూడా భిన్నంగా స్పందిస్తున్నారు. ఇక కరీనా కపూర్ వద్ద ఇలాంటి టీషర్ట్ లు పదుల సంఖ్యలో చాలానే ఉన్నట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X