»   » రణ‌్‌వీర్‌, దీపికా పెళ్లి జరుగడం కష్టమే.. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లో షాకింగ్ ట్విస్ట్!

రణ‌్‌వీర్‌, దీపికా పెళ్లి జరుగడం కష్టమే.. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లో షాకింగ్ ట్విస్ట్!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్‌లో దీపికా పదుకొన్-రణ్‌వీర్ సింగ్, ప్రియాంక-నిక్ జోనర్స్ పెళ్లి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారాయి. వారి పెళ్లి తేదీల గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఇటలీలో దీపిక, రణ్‌వీర్ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్త కొద్దికాలంగా హల్‌చల్ చేస్తున్నది. అయితే ఈ పెళ్లి వార్తకు సంబంధించిన షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే..

  దీపిక నిర్ణయానికే

  దీపిక నిర్ణయానికే

  తమ పెళ్లికి సంబంధించిన నిర్ణయాన్ని రణ్‌వీర్ సింగ్ దీపిక చేతిలో పెట్టారు. పెళ్లి ఎప్పుడు చూసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలి అనే విషయాన్ని ఆమెకే వదిలేశారు. అలాగే పెళ్లి తర్వాత ఎక్కడ ఉండాలి. ఫ్యామిలీ ఏర్పాటు విషయాలు దీపికకు అప్పగించారు అని వారి సన్నిహితులు పేర్కొన్నారు.

  ఉత్సాహంగా రణ్‌వీర్ సింగ్

  ఉత్సాహంగా రణ్‌వీర్ సింగ్

  దీపిక నిర్ణయాలకు రణ్‌వీర్ బాగా గౌరవం ఇస్తాడు. రణ్‌వీర్ లాంటి కమిట్‌మెంట్ ఉన్న బాయ్‌ఫ్రెండ్ బాలీవుడ్‌లో కనిపించడు. తనను భార్యగా పొందే రోజు కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. దీపికతో కలిసి ఫ్యామిలీని ఏర్పాటు చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడు అని రణ్‌వీర్ సింగ్ స్నేహితుడు వెల్లడించాడు.

  నవంబర్ 20 తేదీన అనుమానమే

  నవంబర్ 20 తేదీన అనుమానమే

  రణ్‌వీర్‌ సింగ్‌తో పెళ్లి తేదీల విషయంలో దీపికా షాకింగ్ నిర్ణయం తీసుకొన్నదనే విషయం మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఈ ఏడాది నవంబర్‌ 20న ఇటలీలోని లేక్ కోమోలో జరుగుతుందనే వార్తలను కొట్టిపడేస్తున్నారు. ఈ ఏడాది కాకుండా 2019లో పెళ్లి జరిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

   ఆహ్వానితుల జాబితా గురించి

  ఆహ్వానితుల జాబితా గురించి

  దీపిక, రణ్‌వీర్ పెళ్లిని ప్రైవేట్ వ్యవహారంగా జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరి పెళ్లికి చాలా కొద్ది సినీ ప్రముఖులు మాత్రమే హాజరుకానున్నారు. కరణ్ జోహర్, రోహిత్ శెట్టి, సంజయ్ లీలా భన్సాలీ, అర్జున్ కపూర్, రణ్‌బీర్ కపూర్ పెళ్లికి హాజరయ్యే జాబితాలో ఉన్నట్టు సమాచారం.

  English summary
  Ranveer Singh and Deepika Padukone are set to tie the knot, fans have been waiting with bated breath for the big day. However, the couple has remained tight-lipped about their wedding plans. Speculation was rife that Ranveer and Deepika will exchange garlands at the picturesque Lake Como in Italy on November 20. However, latest reports suggest that the wedding has been pushed to 2019.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more