Aishwarya Rai Bacchan: కూతురితో లిప్ లాక్ ఫొటో వైరల్.. వామ్మో.. దారుణంగా ట్రోలింగ్!
సినీ తారలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న ట్రోలింగ్ ఏ స్థాయిలో పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక విధంగా స్టార్స్ అందరూ ఫ్యాన్స్ కు దగ్గరగా ఉండాలి అని సోషల్ మీడియాలో తరచుగా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. కానీ వాటిపై పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తూ ఉండడం కొందరిని మరింత బాధపెడుతోంది. ఇటీవల ఐశ్వర్యరాయ్ బచ్చన్ పోస్ట్ చేసిన ఫోటోపై కూడా దారుణంగా ట్రోలింగ్స్ రావడం విస్మయానికి గురిచేస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే..

49 ఏళ్ళ వయసులో
మాజీ విశ్వసుందరి టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ వయసుతో సంబంధం లేకుండా తన ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. ప్రస్తుతం ఆమె వయసు 49 సంవత్సరాలు అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. వయసుతో మాయ చేస్తూ ఇతరం కుర్ర హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసుకోకుండా ఆమె గ్లామర్ తో మెప్పిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో నిత్యం ఆమె ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి.

వల్గర్ గా లేకుండా..
ఇక సోషల్ మీడియాలో ఐశ్వర్యారాయ్ స్పందించేది చాలా తక్కువే. మిగతా హీరోయిన్స్ కంటే కూడా ఆమె గ్లామరస్ ఫోటోషూట్స్ లో కూడా అంతగా రెచ్చిపోయి అయితే కనిపించదు. పెళ్లి తర్వాత అయితే ఆమె వల్గర్ గా లేకుండా ఫోటోషూట్స్ లో పాల్గొనే ప్రయత్నం చేస్తోంది. ఇక ఐశ్వర్య ఎక్కడికి వెళ్లినా కూడా కెమెరాలన్నీ కూడా ఆమె వైపే ఫోకస్ చేస్తూ ఉంటాయి.

కూతురితో ఐశ్వర్య ఫొటో
ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పెరిగిపోతున్న నెగిటివిటీ ఎంత దారుణంగా తయారయింది అంటే అందమైన ప్రేమనురాగల మధ్యలో కూడా తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితికి వచ్చింది. రీసెంట్ గా ఐశ్వర్యారాయ్ తన కూతురితో కలిసి దిగిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన కూతురి పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఆ విధంగా స్పెషల్ ఫోటోని పోస్ట్ చేస్తూ బర్త్ డే విషెస్ ను అందించింది.

నెగిటివ్ ట్రోలింగ్
అయితే ఆ ఫోటోలో ఐశ్వర్యారాయ్ తన కూతురు ఆరాధ్య లిప్ కిస్ ఇచ్చుకున్నట్లు ఉండడంతో దానిపై కూడా మాతృత్వపు ప్రేమను చూడకుండా కొంతమంది దారుణంగా ట్రోలింగ్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని మరి కొందరు స్పందిస్తున్నారు. అసలు ఇది మన సంస్కృతికి విరుద్ధమని కొందరు అంటుంటే అసలు అమితాబచ్చన్ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేయడం ఏంటి? మిమ్మల్ని చూసి జనాలు ఏం నేర్చుకుంటారు.. అని మరికొందరు నెగిటివ్ గా ట్రోలింగ్ చేస్తున్నారు.

ఐశ్వర్య ఫ్యాన్స్ కౌంటర్లు
నిజంగా ఈ ఫోటో చాలా దారుణంగా ఉంది అని.. ఇలాంటి ఫోటోలు మరోసారి పోస్ట్ చేయకు అని.. మరికొందరు రియాక్ట్ అవుతూ ఉండగా వారికి ఐశ్వర్య అభిమానులు దీటుగా సమాధానం చెబుతున్నారు. ఇలాంటి మాతృత్వపు ప్రేమలో కూడా అంత దారుణంగా ఎలా ఆలోచిస్తారో అర్థం కాదు అని, ప్రతి ఫోటోను అలా చూస్తే ఇక ఏ సెలబ్రిటీ కూడా ఫోటోలు పోస్ట్ చేయలేరు అని అంటున్నారు. అలాగే తప్పుడు ఆలోచనతో కాకుండా మంచి మనసుతో ఆలోచించాలి అని మరికొందరు ట్రోలర్స్ పై విరుచుకుపడుతున్నారు.


Click it and Unblock the Notifications











