రావల్సిండి ఎక్స్‌ప్రెస్‌గా సల్మాన్ ఖాన్.. బాలీవుడ్‌లో మరో బయోపిక్?
బాలీవుడ్ తెరపైన బయోపిక్ నిర్మాణాల హవా కొనసాగుతూనే ఉంది. క్రికెటర్లు, అజారుద్దీన్, మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా బయోపిక్స్ ప్రేక్షకులను ఆలరించిన సంగతి తెలిసిందే. తాజాగా క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్, సైనా నేహ్వాల్ లాంటి క్రీడాకారులు జీవితం ఆధారంగా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇంకా సానియా మిర్జా బయోపిక్ నిర్మాణంపై చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అఖ్తర్ బయోపిక్ విషయం తెరపైకి వచ్చింది. వివరాల్లోకి వెళితే...
Recommended Video

సల్మాన్ ఫ్యాన్‌గా షోయబ్
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ అంటే షోయబ్ అఖ్తర్‌కు చెప్పలేనంత ఇష్టం. సల్మాన్ సినిమాలన్నా.. నటన అంటే చెప్పలేనంత ఇష్టం. వీలుచిక్కితే సల్మాన్, షోయబ్ ఇద్దరు కలిసి సమయాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. వారిద్దరి మధ్య మంచి స్నేహపూరితమైన రిలేషన్స్ ఇప్పటికి కొనసాగుతున్నాయి.

దుబాయ్‌లో కలిసి పలు కార్యక్రమాల్లో
ఇటీవల సల్మాన్ ఖాన్, షోయబ్ అఖ్తర్ దుబాయ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వారిద్దరూ కలిసి కొంత సమయాన్ని అక్కడ ఎంజాయ్ చేశారు. ఆ సందర్భంగా సల్మాన్‌తో దుబాయ్‌లో కలిసి ఉండటం గొప్ప అనుభూతి. బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ద్వారా ఆయన చేసే పనులు ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి అని షోయబ్ అఖ్తర్ అన్నారు.

నా బయోపిక్ తీస్తే సల్మానే కరెక్ట్
దుబాయ్ పర్యటనలో షోయబ్ అఖ్తర్ మీడియాతో మాట్లాడుతూ.. నా బయోపిక్ తీయాల్సి వస్తే.. సల్మాన్ ఖాన్ ఆ సినిమాలో నటించాలని కోరుకొంటాను. నా జీవిత కథకు ఆయన అయితేనే న్యాయం చేస్తారు. బాలీవుడ్‌లో ఎవరైనా సినిమా తీస్తే అది సల్మాన్ ఖాన్‌తోనే తీయాలి అని అన్నారు.

కపిల్ బయోపిక్ త్వరలో
బాలీవుడ్‌లో బయోపిక్ విషయానికి వస్తే.. 1983లో ప్రపంచ కప్ విజయం నేపథ్యంగా కపిల్ దేవ్ జీవిత కథ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా సినిమా రిలీజ్ ఆలస్యం కానున్నది. ఈ ఏడాది చివర్లో 83 చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











