The Kerala Story ఇండియాలో బ్యాన్ చేయాలా? వివాదాల మధ్య ది కేరళ స్టోరి రిలీజ్ ఎప్పుడంటే?

ది కశ్మీరీ ఫైల్స్ తర్వాత అంతటి వివాదాస్పదంగా నిలిచిన చిత్రం ది కేరళ స్టోరి (The Kerala Story). అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసీస్ (ISIS) 32 వేల మంది భారతీయ మహిళలను బలవంతంగా ఇస్లాంలోకి మత మార్పిడి చేశారనే కథా నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం వివాదాల మధ్య రిలీజ్‌కు సిద్దమైంది.

ది కేరళ స్టోరి ట్రైలర్‌లో చూపించిన 32 వేల మంది మత మార్పిడికి గురయ్యారనే అంశాన్ని కొన్ని వర్గాలు ఖండించాయి. అయితే చిత్ర నిర్మాతలు ఆ సంఖ్యను మార్చివేయడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మే 5 తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై నిర్మాత వెల్లడించిన విషయాల్లోకి వెళితే..

Should The Kerala Story needs to be banned India?

మాకు చట్టాలపై నమ్మకం ఉంది: ది కశ్మీరీ ఫైల్స్ (The Kerala Story) సినిమాను నిషేధించాలని వస్తున్న డిమాండ్‌ సరికాదు. మేము ఎలాంటి అవాస్తవాలను సినిమాలో పొందు పరచలేదు. కంటెంట్ పరంగా ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే మాకు ఎలాంటి భయం కూడా లేదు. మాకు చట్టాలపై నమ్మకం ఉంది. మా సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చింది. సర్టిఫికెట్ ఇవ్వడానికి ముందు సుమారు రెండున్నర నెలలు నిశితంగా సినిమాను పరిశీలించారు అని విపుల్ షా అన్నారు.

Should The Kerala Story needs to be banned India?

సెన్సార్ బోర్టు అడిగిన ప్రశ్నలకు: ది కశ్మీరీ ఫైల్స్ (The Kerala Story) సినిమాను సెన్సార్ బోర్డు రివ్యూ చేసినప్పుడు వాళ్లు అడిగిన ప్రతీ డాక్యుమెంట్‌ను అందజేశాం. అడిగిన ప్రతీ ప్రశ్నకు వివరాలు అందించాం. మేము ఇచ్చిన సమాచారాన్ని అధికారులు నిజమని నమ్మారు. మా వాదనలపై సంతృప్తి చెందిన తర్వాతే మాకు సెన్సార్ సర్టిఫికెట్ అందించారు. కానీ కొన్ని వర్గాలు మా సినిమాకు వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేశారు అని విపుల్ షా తెలిపారు.

Should The Kerala Story needs to be banned India?

కోర్టులు, చట్టాలపై నమ్మకం: ది కశ్మీరీ ఫైల్స్ (The Kerala Story) సినిమాను నిషేధించాలనే డిమాండ్‌ను ఉన్నత న్యాయస్థానానికే వదిలేశాం. కోర్టులపై, చట్టాలపై మాకు నమ్మకం ఉంది. కోర్టులు ఎలాంటి నిర్ణయం తీసుకొన్నా మేము దానికి కట్టుబడి ఉంటాం. మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అనసరపు డిమాండ్లను పట్టించుకోమని నిర్మాత విపుల్ షా పేర్కొన్నారు.

Should The Kerala Story needs to be banned India?

రాజకీయ పార్టీలు అనవసర రాద్దాంతం: ది కశ్మీరీ ఫైల్స్ (The Kerala Story) సినిమాపై కొన్ని రాజకీయ పార్టీలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ప్రతీ రాజకీయ పార్టీకి కొన్ని సిద్దాంతాలు ఉంటాయి. వాళ్లు వారి ఐడియాలజీ ప్రకారం మాట్లాడుతారు. ఒకవేళ మా సినిమాను వ్యతిరేకిస్తే.. వారి ఐడియాలజీని తప్పు పట్టినట్టు భావిస్తున్నారు. అందుకే ప్రజలకు ఈ సినిమాను చూపించకూడదని భావిస్తున్నారు అని విపుల్ షా తెలిపారు.

Should The Kerala Story needs to be banned India?

మే 5వ తేదీన ది కేరళ స్టోరి: ది కశ్మీరీ ఫైల్స్ (The Kerala Story) సినిమా విషయానికి వస్తే.. అదా శర్మ, సిద్ది ఇద్నానీ, ప్రణయ్ పంచోరి, యోగితా బిహాని, చంద్రశేఖర్ దత్తా తదితరులు నటించారు. విపుల్ షా నిర్మించిన ఈ చిత్రానికి సుదీప్టో సేన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X