రియా చక్రవర్తి ఆదేశాలతో సుశాంత్‌కు డ్రగ్స్.. బండారం బయటపెట్టిన షోవిక్ చక్రవర్తి

డ్రగ్స్ మాఫియాతో సంబంధాల ఆరోపణలపై హీరోయిన్ రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి, దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ శ్యామూల్ మిరాండా అరెస్ట్‌తో బాలీవుడ్ ఉలిక్కిపడింది. సుశాంత్ మరణం కేసులో దర్యాప్తులో భాగంగా బాలీవుడ్‌తో డ్రగ్ మాఫియా లింకులు బయటకు రావడంతో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. అయితే ఎన్సీబీ అధికారులు విచారణలో షోవిక్ చెప్పిన విషయాలు దిగ్బ్రాంతిని కలిగిస్తున్నాయి. షోవిక్ అరెస్ట్ తర్వాత బయటకు వచ్చిన విషయాలు ఏమిటంటే..

Recommended Video

Sushant Singh Rajput : రియా చక్రవర్తి ఆదేశాలతో సుశాంత్‌కు డ్రగ్స్ ఇచ్చాం - షోవిక్ చక్రవర్తి
 డ్రగ్స్ సప్లయర్ బాసిత్‌తో లింకులు

డ్రగ్స్ సప్లయర్ బాసిత్‌తో లింకులు

డ్రగ్స్ మాఫియా లింకులపై దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ బ్యూరో శుక్రవారం ఉదయమే రియా, షోవిక్, శ్యామూల్ మిరాండా నివాసాలపై దాడులు చేసింది. షోవిక్‌కు డ్రగ్స్ సప్లయర్ బాసిత్‌కు సన్నిహిత సంబంధాలు, డ్రగ్స్ వాడకం విషయాలు బయటకు రావడంతో ల్యాప్‌టాప్ సీజ్ ఆయనను అదుపులోకి తీసుకొన్నారు.

శనివారం కోర్టుకు షోవిక్ చక్రవర్తి

శనివారం కోర్టుకు షోవిక్ చక్రవర్తి

సెప్టెంబర్ 4వ తేదీన రోజంతా విచారించిన అనంతరం షోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేశారు. ఆయనపై ఎన్టీపీఎస్ యాక్ట్ కింద సెక్షన్ 20బీ, 20ఏ, 27 కింద అరెస్ట్ చేసినట్టు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. శనివారం ఉదయం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

 రియా చక్రవర్తి ఆదేశాలతోనే డ్రగ్స్

రియా చక్రవర్తి ఆదేశాలతోనే డ్రగ్స్

ఎన్సీబీ అధికారుల విచారణలో షోవిక్ చక్రవర్తి సంచలన విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తున్నది. శ్యామ్యూల్ మిరాండా సహాయంతో డ్రగ్స్ సేకరించాను. నా సోదరి రియా చక్రవర్తి ఆదేశాల మేరకు సుశాంత్ సింగ్‌కు డ్రగ్స్ ఇచ్చాం అని షోవిక్ పలు విషయాలను బయటపెట్టినట్టు తెలుస్తున్నది.

బాసిత్‌తో గత రెండేళ్లుగా

బాసిత్‌తో గత రెండేళ్లుగా

ఇక డ్రగ్స్ సప్లయర్ బాసిత్ పరిహార్‌తో చాలా ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయి. ముంబైలోని బాంద్రా వద్ద ఉన్న ఫుట్‌బాల్ క్లబ్‌లో కలుసుకొనే వాళ్లం. రెండేళ్లుగా కాంటాక్ట్‌‌లో ఉన్నాం. చాలాసార్లు మా ఇంటికి కూడా బాసిత్ వచ్చారు. నా కుటుంబంతో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి అని షోవిక్ చెప్పినట్టు సమాచారం. అయతే బాసిత్ కూడా అరెస్ట్ అయి సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఎన్సీబీ కస్టడీలో ఉంటారు.

రియా చక్రవర్తిపై మెడపై అరెస్ట్ కత్తి

రియా చక్రవర్తిపై మెడపై అరెస్ట్ కత్తి

డ్రగ్స్ కేసులో ప్రస్తుతం రియా చక్రవర్తిపై అరెస్ట్ కత్తి వేలాడుతున్నది. ఇప్పటికే ఈ కేసులో రియాను సీబీఐ, ఈడీ, ఎన్సీబీ ప్రశ్నించాయి. డ్రగ్స్ కేసులో రియాపై ఎన్సీబీ క్రిమినల్ కేసు కూడా నమోదు చేసింది. ఆమె రెండు ఫోన్లను స్వాధీనం చేసుకొని వాటిలోని ఛాటింగ్స్, మెసేజ్‌లను పరిశీలిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X